బల్క్ డ్రగ్ పాలసీపై కసరత్తు! | the target to investment in pharma : Centeral government | Sakshi
Sakshi News home page

బల్క్ డ్రగ్ పాలసీపై కసరత్తు!

Published Sat, Feb 8 2014 1:43 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

బల్క్ డ్రగ్ పాలసీపై కసరత్తు! - Sakshi

బల్క్ డ్రగ్ పాలసీపై కసరత్తు!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల తయారీ, నాణ్యత, ధరలు, పెట్టుబడులు వంటి కీలకాంశాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పాలసీపై కసరత్తు చేస్తోంది. ఈ పాలసీతో ఫార్మా రంగంలో పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం డెరైక్టర్ బీకే సింగ్ చెప్పారు. విద్యుత్, ఫార్మా, రసాయనాలు, ఎరువులు వంటి మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర  ఈ పాలసీ కిందికి తీసుకొచ్చి ఫార్మా రంగంలో నూతన ఆవిష్కరణలు చేస్తామన్నారు.

 శుక్రవారమిక్కడ ‘ఫార్మాసూటికల్స్ విభాగం, కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ’తో చర్చాకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీకే సింగ్ మాట్లాడుతూ.. ఐటీ, పరిశ్రమ రంగాలకు మాదిరిగా ‘ఫార్మా క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీం’ను తీసుకొచ్చి ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో  బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీడీఎంఏఐ) ఎం జయంత్ ఠాగూర్, ఫార్మాసూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) రీజనల్ డెరైక్టర్ కే సుబ్బిరెడ్డి, సీఐఐ ఏపీ ప్రెసిడెంట్ బీ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement