47,000 దాటేసింది- వెనకడుగు వేస్తోంది | Sensex crosses 47,000 points milestone | Sakshi
Sakshi News home page

కన్సాలిడేషన్‌ బాటలో- 47,000కు సెన్సెక్స్‌

Published Fri, Dec 18 2020 9:46 AM | Last Updated on Fri, Dec 18 2020 10:33 AM

Sensex crosses 47,000 points milestone - Sakshi

ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 126 పాయింట్లు క్షీణించి 46,764కు చేరింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు క్షీణించి 13,705 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. 47,026 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అయితే తదుపరి అమ్మకాలు తలెత్తడంతో 46,744 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ 13,771-13,693 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఆర్థిక రికవరీ అంచనాలు, ఈక్విటీలలో ఎఫ్‌పీఐల నిరవధిక పెట్టుబడుల కారణంగా ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. గురువారం యూఎస్‌ స్టాక్‌ ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. నాస్‌డాక్‌ వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టంవద్ద నిలవడం గమనార్హం. (బెక్టర్స్‌ ఫుడ్‌ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్)

ఐటీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ దాదాపు 2 శాతం జంప్‌చేగా.. ఎఫ్‌ఎంసీజీ 0.15 శాతం పుంజుకుంది. రియల్టీ, ప్రయివేట్‌, పబ్లిక్‌ బ్యాంక్స్‌, మెటల్‌, మీడియా 0.8-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఆటో, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌, హీరో మోటో 2,7-0.8 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, కొటక్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌ 1.4-0.7 శాతం మధ్య నీరసించాయి.

కోఫోర్జ్‌ ప్లస్‌
డెరివేటివ్స్‌లో కోఫోర్జ్‌, మైండ్‌ట్రీ, నౌకరీ, పిడిలైట్‌, కాల్గేట్‌ పామోలివ్‌ 4.25-1.2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు శ్రీరామ్‌ ట్రాన్స్‌, సన్‌ టీవీ, ఇండస్‌ టవర్‌, ఆర్‌ఈసీ, సెయిల్‌, అశోక్‌ లేలాండ్‌ 2-1 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,435 నష్టపోగా.. 699 లాభాలతో ట్రేడవుతున్నాయి. 

ఎఫ్‌ఫీఐల జోరు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,355 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,982 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1,718 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement