స్టాక్‌మార్కెట్ల దూకుడు: సరికొత్త రికార్డులు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో భారీలాభాలతో మొదలైన సెన్సెక్స్ 31,333 నిఫ్టీ 9673 వద్ద కొత్త రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. ఒకదశలో డబుల్ సెంచరీ కొట్టిన మార్కెట్లలో సెన్సెక్స్ 133 పాయింట్లు ఎగిసి 31,271 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 9660 వద్ద పటిష్టంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో ఉండగా మెటల్ స్వల్పంగా నష్టపోతోంది. ఫార్మా, ఆటో, ఐటీ జోరు కొనసాగుతోంది.
ముఖ్యంగా టీవీఎస్ మోటార్, అదానీ పోర్ట్, ఐషర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ లాభాలు మార్కెట్లను లీడ్ చేస్తుండగా రేమాండ్, డీసీబీ లుపిన్, ఎంఎం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా హిందుస్తాన్ యూనీలీవర్, ఆర్‌కాం, బజాజ్ ఆటో నష్టపోతున్నాయి.