సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమైన ఆ తరువాత మరింత స్టాక్‌మార్కెట్లు జోరందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా ఎగిసి సరికొత్త గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 12000 పాయింట్లను అధిగమించింది.ప్రస్తుతం 141 పాయింట్లు ఎగసి 40,610వద్ద నిఫ్టీ 31 పాయింట్లు పుంజుకుని 11997వద్ద ట్రేడవుతోంది.
ప్రధానంగా రియల్టీ 2 శాతం, బ్యాంక్ నిఫ్టీ లాభపడుతుండగా, మెటల్, ఆటో రంగాలు బలహీనంగా ఉన్నాయి. ఇన్‌ఫ్రాటెల్, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, జీ, సన్ ఫార్మా, టీసీఎస్, గ్రాసిమ్, ఎస్‌బీఐ లాభాల్లో కనొసాగుతున్నాయి. అయితే టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, వేదాంతా, యస్ బ్యాంక్, బీపీసీఎల్, హీరో మోటో, ఐషర్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ నష్టపోతున్నాయి. మరోవైపు రియల్టీ రంగంకోం కేంద్రం రూ. 25వేలకోట్ల ఫండ్ ప్రకటించడంతో రియల్టీ హౌసింగ్‌షేర్లలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్, శోభా, ప్రెస్టేజ్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్‌ఎఫ్, బ్రిగేడ్ భారీగా లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment