
సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరలపై దేశవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్నప్పటికి పెట్రో ధరల పరుగుకు అడ్డకట్ట పడటంలేదు. ఇటీవల భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం కూడా ఇంకా రికార్డు హైలో కొనసాగుతున్నాయి.
సోమవారంతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి లీటరు రూ.80.87 పైసలకు చేరింది. డీజిల్ ధర లీటరుకు రూ. 72.97గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు ధర 14 పైసలు పెరిగి 88.26 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర 15 పైసలు పెరిగి 77.47 గా ఉంది.చెన్నైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 14, 15 పైసలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు రూ. 84.05, ధర రూ. 77.13గా ఉంది. కోలకతాలో పెట్రోలు, డీజిల్ ధరలు 14 పైసలు పెరిగి 83.75, 75.82 రూపాయలకు చేరింది.
హైదరాబాద్ లో మంగళవారం లీటర్ పెట్రోలు ధర రూ.85.60 కాగా లీటర్ డీజిల్ ధర రూ.79.22గా ఉంది. పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర 24 పైసలు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గించింది. దీంతో సోమవారం నాటి ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. అలాగే రాజస్థాన్ సర్కార్ కూడా 4 శాతం వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ లీటరు ధరలపై రూ.2 .50 తగ్గిస్తూ వసుంధరా రాజే సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment