రికార్డులు సృష్టించిన అమెరికా మార్కెట్లు | Dow, Nasdaq, S&P 500 End At Records For First Time Since 1999 | Sakshi
Sakshi News home page

రికార్డులు సృష్టించిన అమెరికా మార్కెట్లు

Published Fri, Aug 12 2016 8:59 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

రికార్డులు సృష్టించిన అమెరికా మార్కెట్లు

రికార్డులు సృష్టించిన అమెరికా మార్కెట్లు

అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లలో ఏ చిన్న కదలిక కనిపించినా చాలు ప్రపంచమార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అలాంటి స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో సంచనాలు సృష్టించాయి. మొదటిసారి 1999 నాటి గరిష్ట స్థానానికి ఎగిసి రికార్డుల వర్షం కురిపించాయి. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్త, మాకీస్, కోహ్ల్స్ డిపార్ట్మెంట్ స్టోర్లు బలమైన రాబడులు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపర్చాయి. దీంతో అమెరికా మూడు మేజర్ స్టాక్ సూచీలు డౌజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 రికార్డు స్థాయిలో క్లోజ్ అయినట్టు బైస్పోక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు వెల్లడించింది.

ఆయిల్ ధరలను స్థిరంగా కొనసాగించడానికి తగిన చర్యలు తీసుకుంటామని సౌదీ ఆయిల్ మంత్రి కామెంట్ల అనంతరం క్రూడ్ ఆయిల్ 5 శాతం మేర జంప్ అయింది. తదుపరి కొన్ని నెలలో క్రూడ్ ఆయిల్ మార్కెట్లు మళ్లీ సమతుల్య స్థానానికి వస్తాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనావేసింది. దీంతో ఎస్ అండ్ పీ ఎనర్జీ ఇండెక్స్ 1.3 శాతం మేర ర్యాలీ కొనసాగించింది. 10 మేజర్ సెక్టార్లలో ఇదే టాప్లో నిలిచింది.  డిపార్ట్మెంట్ స్టోర్ ఆపరేటర్ మాకీస్ కనీసం ఎనిమిదేళ్ల అనంతరం అంచనావేసిన దానికంటే తక్కువగానే రాబడులు పడిపోయినప్పటికీ, స్టోర్ అమ్మకాలు ఎగిసినట్టు తన త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. దీంతో మాకీస్ షేర్లు 17.09 శాతం దూసుకెళ్లాయి. అదేవిధంగా కోహ్ల్స్ కూడా మార్కెట్ విశ్లేషకలు అంచనాలను అధిగమించి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. దీంతో ఆ స్టోర్ షేర్లు కూడా 16.17 శాతం ఎగిశాయి. ఈ బలమైన ఆదాయాల సంకేతాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుందని వెల్లడవుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎస్ అండ్ పీ ఇండెక్స్ జూన్ చివరి నుంచి 7.0 శాతం పెరిగింది. అంచనావేసిన దానికంటే అధికంగానే త్రైమాసిక ఫలితాలు, తక్కువ వడ్డీరేట్లు అమెరికా మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ కొంత మంది ఇన్వెస్టర్లు ఎక్కువ వాల్యుయేషన్పై భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం ఎస్ అండ్ పీ 500 ముందటి రికార్డులను కొల్లగొట్టింది. అంచనావేసిన దానికంటే 17 టైమ్స్ ఎగిసింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ సగటున 100 పాయింట్లకు పైగా పెరిగి 18,613.52 వద్ద, ఎస్ అంట్ పీ 500 ఇండెక్స్  0.47 శాతం పెరిగి 2,185.79 దగ్గర, నాస్ డాక్ కంపొజిట్ 0.46 ఎగిసి 5,228.40వద్ద క్లోజ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు రికార్డులు సృష్టించడంతో, ఆసియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ స్టాక్ సూచీలు కూడా శుక్రవారం ట్రేడింగ్లో లాభాలతోనే ఎంట్రీ కానున్నట్టు మార్కెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement