అంతర్జాతీయ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. రీటైల్, టెక్ షేర్లలో భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉదయం ఆసియా, మధ్యాహ్నం యూరో సహా అన్ని తరహా షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. డౌ జౌన్స్ 30 సూచీ ఏకంగా400 పాయింట్లకు పైగా క్షీణించింది. ఎస్ అండ్ పీ 500 కూడా ఒక శాతంపైగా తగ్గింది. ఇక నాస్‌డాక్ అమ్మకాల జోరు అధికంగా ఉంది. 2.29 శాతం నష్టంతో ఏడు నెలల కనిష్టాన్ని తాకింది. 2018 నాటి లాభాలు తుడిచిపెట్టుకు పోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ‍్యంగా టెక్ కంపెనీ షేర్లు ఫేస్‌బుక్ 0.9 శాతం, అమెజాన్, ఆపిల్. నెట్‌ఫ్లిక్స్ 3శాతం, ఆల్ఫాబెట్ 1.4శాతం కుప‍్పకూలాయి. ఆపిల్ ఫోన్ల అమ్మకాలు మందగించడంతో ఆ కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అక్టోబర్ 3 నుంచి ఈ షేర్ దాదాపు 20 శాతం దాకా క్షీణించింది. నాస్ డాక్ సూచీ ఇపుడు ట్రేడవుతోంది. అనేక టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అటు ముడి చమురు షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. బ్రెంట్ క్రూడ్ 1.8 శాతం క్షీణించగా, డబ్ల్యూటీఐ చమురు రెండు శాతం క్షీణించింది. ఈ పరిణామాలన్నీ రేపటి దేశీయ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment