
ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదుచేసుకుంది. ఒక్కరోజులోనే మెటా షేర్లు 20 శాతం తగ్గి సుమారు రూ. 200 బిలియన్ డాలర్ల నష్టాలను మూటగట్టుకుంది.
భారీ షాకిచ్చిన యూజర్లు..!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు యూజర్లు గట్టి షాకిచ్చారు. ఫేస్‌బుక్ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారి రోజువారీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో మెటా షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. టిక్‌టాక్, యూట్యూబ్ నుంచి గణనీయమైన పోటీ రావడంతో మెటా గడిచిన త్రైమాసికంలో భారీ నష్టాలను మూటకట్టుకుంది. మెటా మార్కెట్ విలువలో ఏకంగా 200 బిలియన్ డాలర్లు ఇట్టే ఆవిరయ్యాయి. మరోవైపు ట్విటర్, పిన్‌ట్రస్ట్, స్నాప్ చాట్ షేర్లు కూడా నేల చూపులు చూశాయి.
కొంపముంచిన వివాదాలు..!
గత ఏడాది మెటా సీఈవో జుకర్‌బర్గ్‌కు అంతగా కలిసి రాలేదు. అనేక వివాదాలలో చిక్కుకొని తీవ్రంగా సతమతమయ్యాడు మార్క్. ఫేస్‌బుక్ వచ్చిన ఆరోపణలతో పేరెంట్ కంపెనీ పేరును మెటాగా మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాది ఫేస్‌బుక్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణలు యూజర్లపై భారీగానే ప్రభావం చూపింది. మెటా క్యూ 4 అంచనాల్లో యూజర్ల సంఖ్య 1.95 బిలియన్లుగా ఫేస్‌బుక్ పేర్కొంది. సుమారు రెండు మిలియన్ల మంది డెయిలీ యూజర్లను ఫేస్‌బుక్ కోల్పోయింది.
చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో!
Comments
Please login to add a commentAdd a comment