
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎస్‌ఎస్‌ఈ) తాజాగా అమెరికా స్టాక్ ఎక్సే్చంజ్ ‘నాస్‌డాక్’తో టెక్నాలజీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే 2–3 ఏళ్లలో ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 ఎక్సే్చంజ్‌లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాం.
తాజా ఒప్పందంలో భాగంగా నాస్‌డాక్ ప్రీమియం మార్కెట్ టెక్నాలజీని ఇండియన్ క్యాపిటల్ మార్కెట్‌లోకి తీసుకువస్తాం. కస్టమైజ్‌డ్ రియల్ టైమ్ క్లియరింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్, సెటిల్‌మెంట్ టెక్నాలజీని ఎన్‌ఎస్‌ఈకి అందిస్తాం’ అని నాస్‌డాక్ ప్రెసిడెంట్, సీఈవో అడెనా ఫ్రైడ్మెన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment