ఫార్మాలో 700 కోట్ల పెట్టుబడులు | Granules And Laurus Pharma Companies To Invest 700 Crore In Telangana | Sakshi
Sakshi News home page

ఫార్మాలో 700 కోట్ల పెట్టుబడులు

Oct 28 2020 2:15 AM | Updated on Oct 28 2020 2:19 AM

Granules And Laurus Pharma Companies To Invest 700 Crore In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పేరొం దిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడు తున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ప్రపం చంలోనే అతిపెద్ద కమర్షియల్‌ ఫార్మాస్యూటి కల్‌ ఫార్ములేషన్‌ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా రాష్ట్రంలో మరో రూ. 400 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ యూనిట్‌ ద్వారా 1,600 మందికి ఉపాధి లభిస్తుంది. వేయి కోట్ల ఫినిష్డ్‌ డోస్‌లను కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్‌ ద్వారా ఉత్పత్తి చేస్తామని గ్రాన్యూల్స్‌  ఇండియా ప్రకటించింది. తమ తాజా యూనిట్‌ను జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ కృష్ణప్రసాద్‌ వెల్ల డించారు. మరోవైపు లారస్‌ ల్యాబ్స్‌ కూడా జీనోమ్‌ వ్యాలీలో రూ. 300 కోట్లతో దశల వారీగా ఫార్ములేషన్‌ ఫెసిలిటీ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే లారస్‌ ల్యాబ్‌ జీనోమ్‌ వ్యాలీలోని ఐకేపీ నాలెడ్జ్‌ పార్కులో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని నెల కొల్పింది. ఇక్కడ యాంటీ రిట్రోవైరల్, అంకా లజీ, కార్డియోవా స్క్యులార్, యాంటీ డయా బెటిక్స్, యాంటీ ఆస్తమా, గ్యాస్ట్రో ఎంటరాల జీకి సంబంధించిన యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడి యెంట్లను తయారు చేస్తుంది. 

ఉపాధి పెరుగుతుంది: కేటీఆర్‌
గ్రాన్యూల్స్‌ ఇండియా, లారస్‌ ల్యాబ్‌ పెట్టు బడులతో తయారీ రంగంలో స్థానిక యువ తకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫార్మా సహా వివిధ రంగాల్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రకటించారు. గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్, లారస్‌ ల్యాబ్‌ సీఈఓ సత్యనారాయణ మంగళవారం కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి తమ నూతన పెట్టుబడుల గురించి వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement