సాక్షి, హైదరాబాద్: వెల్‌స్పన్ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్’ హైదరాబాద్‌లో రూ.350 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపొనెంట్స్, ఇతర పరికరాలను తయారుచేసే ఈ యూనిట్ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వెల్‌స్పన్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న చందన్‌వెల్లిలోనే సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటవుతుంది.
ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావుతో పాటు వెల్‌స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా హాజరవుతారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహిసున్న వెల్‌స్పన్ గ్రూప్ రాష్ట్రంలో మరింత విస్తరించనుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటులోని మౌలిక వసతుల వలన అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment