ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డీకేజెడ్ టెక్నాలజీస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి.. పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామంటూ ప్రచారం చేశారు. రూ. 500 కోట్ల వరకు నిర్వాహకులు వసూలు చేశారు. మొదట పెట్టుబడి పెట్టిన వాళ్లకి తిరిగి వడ్డీ రూపంలో చెల్లించిన నిర్వాహకులు.. ప్రతి నెల వడ్డీలు తిరిగి చెల్లిస్తుండడంతో వేల మందిని బాధితులు పెట్టుబడులు పెట్టించారు.
గత రెండు నెలల నుంచి తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో కంపెనీ నిర్వాహకులను బాధితులు నిలదీశారు. మాదాపూర్‌లోని ఆఫీస్‌కి తాళం వేసి నిందితులు పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
మహమ్మద్ ఇక్బాల్, రాహిల్, డీకేజెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టోర్స్ ద్వారా ఈ కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామంటూ నిందితులు ప్రచారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment