సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో సంస్థ భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. ‘‘ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం ఏముంటుంది? అని సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ‘మాస్ మ్యూచువల్’ సంస్థ ప్రకటించింది. అమెరికా వెలుపల రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
మాస్ మ్యూచువల్ కంపెనీ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటన వెలువడడంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘‘ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం ఏముంటుంది? టాప్ ఫార్చున్ 500 కంపెనీల్లో ఒకటైన మాస్ మ్యూచువల్‌ను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
మాస్ మ్యూచువల్ సంస్థ అమెరికాకు చెందినది. ఈ కంపెనీ టాప్ ఫార్చూన్- 500లో చోటు దక్కించుకుంది. ఆ సంస్థ తొలిసారి అమెరికా వెలుపల రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు హైదరాబాద్‌లో పెడుతుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment