హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు రేవంత్ సిద్ధమా? అని సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. తాను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. మాతో పాటు కేసీఆర్ కూడా లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు.
సహారా, ఈఎస్‌ఐ కుంభకోణాలు, సీబీఐ కేసులలో వీరు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాగా, తనపై రేవంత్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి కేటీఆర్ హైకోర్టులో పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
చదవండి: తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment