హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు మధ్యంతర డివిడెండ్ రూ.1.2 చెల్లించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మార్చి త్రైమాసికంలో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం క్షీణించి రూ.103 కోట్లు నమోదు చేసింది. మార్జిన్స్ 7.5 శాతం సాధించింది.
ఎబిటా 28 శాతం తగ్గి రూ.287 కోట్లు, ఎబిటా మార్జిన్ 20.8 శాతంగా ఉంది. ఈపీఎస్ రూ.1.9 నమోదైంది. టర్నోవర్ 3% తగ్గి రూ. 1,381 కోట్లకు వచ్చి చేరింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,041 కోట్ల టర్నోవర్‌పై రూ.790 కోట్ల నికరలాభం పొందింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో లారస్ షేరు ధర గురువారం 2.60 శాతం క్షీణించి రూ.292.25 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment