వైజాగ్లో లారస్ల్యాబ్స్ ఆర్అండ్డీ కేంద్రం | Laurus Labs, R&D D Center in vizag | Sakshi
Sakshi News home page

వైజాగ్లో లారస్ల్యాబ్స్ ఆర్అండ్డీ కేంద్రం

Published Sat, Dec 3 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

మీడియా సమావేశంలో సత్యనారాయణ, రవి కుమార్ (కుడి వ్యక్తి)

మీడియా సమావేశంలో సత్యనారాయణ, రవి కుమార్ (కుడి వ్యక్తి)

మరో రెండు తయారీ కేంద్రాలు కూడా
కొత్తగా 300 మంది నియామకం
ఐపీవో డిసెంబర్ 6న ప్రారంభం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఔషధ తయారీ రంగంలో ఉన్న లారస్ ల్యాబ్స్ వైజాగ్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని 2017 జూన్ నాటికి నెలకొల్పుతోంది. ఇప్పటికే సంస్థకు హైదరాబాద్‌తోపాటు యూఎస్‌లోని బోస్టన్‌లో ఇటువంటి సెంటర్లున్నారుు. 2,300 మంది సిబ్బందిలో 25 శాతం ఆర్‌అండ్‌డీలో పనిచేస్తున్నారు. ఈ విభాగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు సంస్థ సీఈవో సి.సత్యనారాయణ తెలిపారు. కంపెనీ ఈడీ రవి కుమార్‌తో కలిసి  శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వైజాగ్ కేంద్రానికి కొత్తగా 100 మందిని నియమిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా ఒకటి, 2017 చివరి నాటికి మరో తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. తయారీ కేంద్రాలకు కొత్తగా 200 మందిని తీసుకుంటామని వివరించారు. తయారీ, ఆర్‌అండ్‌డీ సెంటర్లకు కంపెనీ రూ.450 కోట్లు పెట్టుబడి పెడుతోంది.

ఐపీవో ద్వారా రూ.1,331 కోట్లు..
లారస్ ల్యాబ్స్ ఐపీవో ఈ నెల 6న ప్రారంభమై 8న ముగియనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన 2.41 కోట్ల షేర్లను జారీ చేస్తోంది. ఒక్కో షేరు ధరను రూ.426-428 ప్రైస్ బ్యాండ్‌గా నిర్ణరుుంచింది. షేర్‌హోల్డర్ల వాటాతో కలుపుకుని మొత్తం 30 శాతం వాటాను విక్రరుుస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫ్రెష్ ఈక్విటీ ద్వారా రూ.300 కోట్లను సమీకరిస్తోంది. దీనితో కలుపుకుని మొత్తంగా ఐపీవో ద్వారా రూ.1,331 కోట్లను సమీకరిస్తోంది. సేకరించిన నిధులను రుణాల చెల్లింపులు, విస్తరణకు వినియోగించనున్నట్టు కంపెనీ తెలిపింది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, జెఫరీస్ ఇండియా, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement