ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడానికి రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. పాఠశాలల్లో ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొట్టమొదటి సమీక్షను విద్యా శాఖపైనే నిర్వహించిన సంగతి తెలిసిందే.