మూసివేత దిశగా ప్రభుత్వ పాఠశాలలు... | the tdp government neglect the public schools | Sakshi
Sakshi News home page

మూసివేత దిశగా ప్రభుత్వ పాఠశాలలు...

Published Tue, Mar 28 2017 4:46 PM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

మూసివేత దిశగా ప్రభుత్వ పాఠశాలలు... - Sakshi

మూసివేత దిశగా ప్రభుత్వ పాఠశాలలు...

► వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి
 

అమరావతి: ప్రైవేటు విద్యావ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా 7,500 ప్రభుత్వం పాఠశాలను మూసివేస్తోందని ఆయన ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద చెవిరెడ్డి మాట్లాడుతూ హేతుబద్ధీకరణ పేరుతో ఇప్పటికే 1,446 పాఠశాలలను రద్దు చేసిందని పేర్కొన్నారు., ఈ ఏడాది మరో 1,500 పాఠశాలలను మూసివేయడానికి రంగం సిద్ధం చేసిందని తెలిపారు.

అదే విధంగా ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగంలో ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల పేరుతో మూడెంచల విద్యావ్యవస్థ ఉంది., ఇప్పుడు దీన్ని ప్రాధమిక, ఉన్నత పేరుతో రెండెంచలకు కుదించాలని నిర్ణయించిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న సుమారు 4,500 ప్రాధమికోన్నత పాఠశాలలు మూతపడి విద్యార్థులకు చదవు దూరమయ్యే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్‌ స్కూల్స్‌ని ప్రోత్సహించడం కోసం ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం అత్యంత భాధాకరమైన విషయామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 61,529 పాఠశాలలు ఉంటే అందులో కేవలం 16,273 మాత్రమే ప్రైవేటు పాఠశాలుగా ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయని సూచించారు.

కానీ చాలా ప్రైవేటు పాఠశాలలు ఒకే రిజిస్ట్రేషన్‌తో అనేక పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,870 ఆదర్శ పాఠశాలకు రూ. 3,000 కోట్లు కేటాయిస్తే ఈ మొత్తం కాంట్రాక్టును ముఖ్యమంత్రి క్లాస్‌మేట్‌కి కట్టబెట్టారని ఆయన అన్నారు. అలాగే యూనిఫాంలకై రూ. 132 కోట్లు ఇస్తే ఈ మొత్తాన్ని ఒకే కాంట్రాక్టరుకి ఇవ్వడం వల్ల పిల్లలకు బట్టల సైజులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మధ్యాహ్నం భోజనం పథకంలో నాసిరకమైన ఆహారాన్ని అందిస్తూ పిల్లలను పరుగుల్లా ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. మరింతమందికి విద్యను అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను పెంచడమే కాకుండా ఉన్న వాటిలో మౌలిక వసతులు పెంచాలని చెవిరెడ్డి డిమాండ్‌ చేశారు.

విష్ణుకుమార్‌కి ఏదైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత

ఒక శాసన సభ సభ్యుని చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారడం అత్యంత విచారకరమన్నారు. విశాఖలో భూ కుంభకోణం వెలికితీసినందుకు రియల్‌ మాఫీయా విష్ణుకుమార్‌ రాజ్‌ను బెదిరిస్తోందని, అతనికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనేక ప్రజాసమస్యలను నిత్యం సభలో ప్రస్తావించే విష్ణుకుమార్‌ రాజుకు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌పార్టీ అండంగా ఉంటుందని చెప్పారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement