టీడీపీ నేతల దాదాగిరి | chevireddy bhasker reddy fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల దాదాగిరి

Published Fri, Jan 13 2017 9:06 PM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

టీడీపీ నేతల దాదాగిరి - Sakshi

టీడీపీ నేతల దాదాగిరి

తిరుపతి :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. అధికార మదంతో దాదాగిరి చెలాయిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు చెందిన కారును శుక్రవారం ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెళితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలనే ఎమ్‌ఆర్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, నారాయణ స్వామి బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఎంఆర్‌పల్లి పీఎస్‌ ఎదుట బైఠాయించారు. తమ కార్యకర్తలను వదిలి పెట్టే వరకు ఎంఆర్‌పల్లి పీఎస్‌ ఎదుటే ఉంటామని స్పష్టం చేశారు.  

సీఎం చంద్రబాబు పండగకు వచ్చి నియోజకవర్గంలోని దళితులకు పండగే లేకుండా చేశారని మండిపడ్డారు. దళితులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో అరాచకం జరుగుతోందని, దళితులకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ ఉంటుందని చెవిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement