తిరుపతి రూరల్: ఎన్నికలకు ముందు ఇ చ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విఫల మయ్యూరని వైస్సార్ సీపీ ప్రజా సేవదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపిం చారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ కార్యాలయూల వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగనున్న ధర్నాకు ప్రజలను సన్నద్ధం చేసేందుకు మంగళవారం సాయంత్రం చెవిరెడ్డి ఆధ్వర్యం లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరి గింది. తిరుపతి రూరల్ మండలం తు మ్మలగుంట చాముండేశ్వరీదేవి ఆల యం నుంచి చెర్లోపల్లె, తొండవాడ మీ దుగా చంద్రగిరి నాగాలమ్మగుడి వరకు వందలాది మంది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ..రైతులు, డ్వాక్రా మహిళలకిచ్చిన హామీలను మాఫి చేయాడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ప్రకటనే పరిమితమైం దని, ఒక్క హామీని నేరవేర్చలేదని మం డిపడ్డారు. రుణాలు మాఫీకాక, కొత్త రుణాలు అందక రైతులు నానా అగచాట్లు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం హామీలను నేరవేర్చే వరకూ ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ ఉద్యమాలు చేస్తుందన్నారు.
పార్టీ శ్రేణులు, పార్టీలకతీతంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, రూరల్ మండల ఉపాధ్యక్షులు పోట్టేలి అనురాధ మునస్వామి, రూరల్, చంద్రగిరి, ఆర్‌సీపురం పార్టీ కన్వీనర్‌లు ఉపేంద్రరెడ్డి, యుగంధర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, జిల్లా నాయకులు శ్రీరాములు, ేహ మేంద్రకుమార్ రెడ్డి, నాగరాజు, మురళీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హామీల మాఫీకి చంద్రబాబు కుట్ర
Published Wed, Nov 5 2014 4:05 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM
Advertisement