కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? | Chevireddy bhaskara reddy challange to the TDP leaders | Sakshi
Sakshi News home page

కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా?

Published Tue, Sep 13 2016 1:57 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? - Sakshi

కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా?

టీడీపీ నేతలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సవాల్

 

 సాక్షి,హైదరాబాద్: స్పీకర్లపై దాడులు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. స్పీకర్ మీద తాము దాడి చేశామంటూ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారం కట్టిపెట్టాలన్నారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. పోడియం దగ్గరకు వెళ్లి నిరసన చెప్పటం సభ్యుల హక్కు అని, ఇది పార్లమెంటరీ సాంప్రదాయంలో కనిపించే సాధారణ విషయమేనన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని పోరాటం చేస్తున్నామే తప్ప, స్పీకర్‌కు వ్యతిరేకంగా కాదని చెవిరెడ్డి స్పష్టం చేశారు.

అసెంబ్లీ సెక్రటరీ గొంతుకు వైర్ చుట్టి చంపబోయారనే అసత్య ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఈ విషయంలో కాణిపాకంలో అయినా, తిరుమలలో అయినా ప్రమాణం చేస్తామని, మీరు చేస్తారా అని టీడీపీ నేతలకు చెవిరెడ్డి సవాల్ విసిరారు.ఎన్టీఆర్‌కే మైక్ ఇవ్వని చరిత్ర స్పీకర్‌గా యనమలకు ఉందన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది వాస్తవం కాదా? నాగం జనార్దనరెడ్డి మైకులు విరిచేసి స్పీకర్‌పై వేసింది నిజం కాదా? రేవంత్‌రెడ్డి గవర్నర్ సీట్‌ను పీక్కొచ్చి బయటేసింది నిజం కాదా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. అనుభవానికి తగినట్టుగా  మంత్రి యనమల మాట్లాడితే బాగుంటుందని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement