ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ఆవాసాలకు చెందిన 20,754 మంది విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా మంగళవారం జీవో జారీ చేశారు. విద్యార్థికి రూ. 1,862 చొప్పున ఆయా విద్యార్థులకు 2018–19 విద్యా సంవత్సరంలో ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా పాఠశాలలు అందుబాటులో లేనందున ఈ మొత్తాన్ని చెల్లించనుంది.
Comments
Please login to add a commentAdd a comment