సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 24 లక్షల మం ది విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజ న ధరలు త్వరలో పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు వండి పెట్టే కూరగాయ లు, నూనె, ఉప్పు, పప్పులకు ఒక్కో విద్యార్థి పై వంట ఏజెన్సీలకు చెల్లించే మధ్యాహ్న భోజనం ధరలను 2016లో పెంచిన కేంద్రం రెండేళ్ల తర్వాత మళ్లీ పెంచింది. 5.35 శాతం ధరలను పెంచి 2018 ఏప్రిల్ 1 నుంచి వాటిని వర్తింపజేయాలని అన్ని రాష్ట్రాలను ఇటీవల ఆదేశించింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. ఎన్నికల కోడ్ ముగిశాక వీటికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుంది.
రోజూ రూ.7 లక్షల అదనపు భారం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,621 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా కూరగాయలు, ఉప్పు, పప్పు, నూనె తదితర వంట సామగ్రి కోసమే రోజూ రూ.1,23,05,648 వెచ్చిస్తోంది. తాజాగా 5.35 శాతం పెంపుతో నిత్యం రూ.1,29,67,108 వెచ్చిం చాల్సి ఉంది. అంటే దాదాపు రూ.7 లక్షలు అదనంగా వెచ్చించాలి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని దాదాపు 19 లక్షల మందికి పైగా విద్యార్థులకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తుండగా, రాష్ట్రం 40 శాతం భరిస్తోంది. 9, 10 తరగతుల్లోని 4,73,883 మంది విద్యార్థులకు అయ్యే మొత్తంలో కేంద్రం వాటా లేనందున రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం వెచ్చిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment