![We will close unrecognized educational institutions - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/28/ee.jpg.webp?itok=Ohy50Xde)
తిరుపతి సత్యనారాయణపురం హైస్కూల్‌లో సైన్స్ ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తున్న విజయ శారదారెడ్డి
తిరుపతి ఎడ్యుకేషన్: గుర్తింపులేని విద్యాసంస్థలను మూసివేయిస్తామని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీఎస్‌ఈఆర్‌ఎం) వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ విజయ శారదారెడ్డి చెప్పారు. తిరుపతి పరిసరాల్లోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలను కమిషన్ సభ్యులతో కలిసి శనివారం ఆమె సందర్శించారు.
అనంతరం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ట్యూషన్ ఫీజులో 70 శాతం ఫీజును విడతలుగా తీసుకోవాలని ప్రభుత్వం జీవో 57ను విడుదల చేసిందని గుర్తుచేశారు. ఈ జీవోను అమలు చేయకుంటే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 784 ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో 60 శాతం కళాశాలల మూసివేతకు ప్రభుత్వానికి సిఫార్సు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment