
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులు ఉండీ టీచర్లు సరిపడ లేని ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో విద్యా వలంటీర్లు రానున్నారు. గతేడాది మంజూరు చేసిన 15,661 మంది విద్యా వలంటీర్లను ఈ విద్యా సంవత్సరం కోసం ఎంగేజ్ చేయాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
పాఠశాలల్లో విద్యా బోధనకు ఆటంకం కలుగకుండా చర్యలు చేపట్టాలని మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన ఆయన బుధవారం విద్యా వలంటీర్లను నియమించేందుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో అవసరమైన పాఠశాలల్లో వారి సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో జిల్లాల్లో అందుకు అవసరమైన చర్యలపై డీఈవోలు దృష్టి సారించారు. అయితే గతేడాది పని చేసిన విద్యా వలంటీర్లనే కొనసాగించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment