janardan reddy
-
TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి బీ.జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. సీఎస్‌కు పంపించినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీఎస్పీఎస్సీ నియామకాలకు సంబంధించి సమీక్ష జరగనుంది. తెలంగాణ ఏర్పాడినప్పటి నుంచి.. ఇప్పటిదాకా జరిగిన నియామకాల ప్రక్రియకు సంబంధించి పూర్తి ఫైళ్లతో సమీక్షకు రావాలని సీఎంవో టీఎస్పీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు పంపింది. అయితే ఈలోపే ఆయన తన పదవికి రాజీనామా చేయడం, దానిని గవర్నర్ ఆమోదించడం జరిగిపోయాయి. -
తీరంలో కరెంట్ తీగలుండవ్.!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 972 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. తుపానులు వచ్చినప్పుడు ఈ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ఎక్కువగా నష్టపోయేది విద్యుత్ వ్యవస్థ. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లను యధాస్థితికి తెచ్చేందుకు వారాలు పడుతుంది. అంత వరకు ఆ ప్రాంతాల ప్రజలు చీకటిలోనే గడపాలి. ఆ సమయంలో పాములు వంటి విషకీటకాల బారిన పడి జనం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ బాధల నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మాజనార్దన రెడ్డి తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ద్వారా తీరం వెంబడి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. భూగర్భ లైన్లు సాధారణంగా దెబ్బతినవని, విద్యుత్ పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతుందని వివరించారు. జాతీయ రోజువారీ విద్యుత్ సరఫరా సగటులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, 24 గంటల్లో 23.56 గంటలకు తగ్గకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిపై ఆయన అందించిన వివరాలు ఆయన మాటల్లోనే.. తీర ప్రాంతంలో ప్రత్యేక గ్రిడ్ తుపాన్లు, గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి తీర ప్రాంతంలో గ్రిడ్‌కు రూపకల్పన చేస్తున్నాం. అంటే దగ్గర్లో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్లను డబుల్ సర్క్యూట్ ద్వారా అనుసంధానం చేస్తాం. దీనినే రింగ్ మెయిన్ అంటారు. దీనివల్ల ఒక సబ్ స్టేషన్ దెబ్బతింటే మరో సబ్ స్టేషన్ నుంచి సంబంధిత ప్రాంతాలకు వెంటనే విద్యుత్ అందించొచ్చు. రైతులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాలు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లతో పాటు రక్షణ పరికరాలు కూడా ఉచితంగా అందజేస్తాం. డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నాం. ఖర్చుంతా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. ఈ మీటర్లకు విదేశాల్లో స్థిరపడ్డవారు కొందరు మినహా మిగతా రైతులంతా రాతపూర్వకంగా అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నాం. గతంలో వ్యవసాయానికి రాత్రి వేళ విద్యుత్ సరఫరా వల్ల పొలాల్లో రైతులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడేవారు. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తోంది. పైగా, స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాల ఏర్పాటు వల్ల రైతులకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కొత్త వ్యవసాయ సర్వీసులను దరఖాస్తు చేసిన నెల లోపే ఇస్తున్నాం. ఇప్పటివరకు 80 వేల కొత్త సర్వీసులు ఇచ్చాం. ప్రజల చేతిలో బిల్లు నియంత్రణ విద్యుత్ బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పొరపాట్లు లేవు. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించిన టారిఫ్ ప్రకారమే చార్జీలు ఉన్నాయి. ప్రజలు విద్యుత్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 263 మిలియన్ యూనిట్లు సరఫరా చేశాం. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ బిల్లు తగ్గించొచ్చు. కెపాసిటర్లు, బ్రేకర్లు నాణ్యమైనవి అమర్చుకోవాలి. ఇంటి లోపల, బయట వాడే బ్రేకర్లు వేర్వేరుగా ఉంటాయి. మాగ్నెటిక్ బ్రేకర్లు వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ఎవరికి వారు బిల్లును నియంత్రించుకోవచ్చు. అవసరాన్నిబట్టి రీచార్జ్ చేసుకోవచ్చు. వారం వారం విద్యుత్ వినియోగం తెలుసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ, హెచ్‌టీ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అందిస్తాం. సరికొత్త సబ్స్టేషన్లు విద్యుత్ సబ్ స్టేషన్లకు స్థలాలు దొరకడంలేదు. దీంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కంటైనర్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండింటిని అందుబాటులోకి తెచ్చాం. మరో రెండు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని పెడుతున్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో, కనకదుర్గ గుడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్)లు ఒక్కటి కూడా పాడవకుండా, ఒక్క రోజు కూడా లోడ్ రిలీఫ్ ఇవ్వకుండా ఈ వేసవిని సమర్ధంగా ఎదుర్కొన్నాం. 30 ఏళ్లు పైబడిన లైన్లు, కండక్టర్లు, బ్రేకర్లను మారుస్తున్నాం. దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గుతాయి. -
మార్కెట్లకు వచ్చే రైతులకు నో లాక్ డౌన్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులను రైతు బజార్లకు, హోల్‌సేల్ మార్కెట్లకు తరలిస్తున్న రైతులకు లాక్డౌన్ ఉత్తర్వులు వర్తించ వని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 20, 21వ తేదీల్లో ఉన్న కూరగాయలు, పండ్లకు ఉన్న రేట్లను ప్రాతిపదికగా తీసుకుని విక్రయాలు జరపాలని ఆదేశించింది. కోవిడ్ మహ మ్మారి పేరుతో సంక్షోభాన్ని సృష్టించడం, దోపిడీ చేయడం, విపరీతమైన ధర పెంపు చేయరాదని తెలిపింది. జిల్లాల్లో కలెక్టర్లు ధర నిర్ణయించి, పర్యవేక్షణ చేస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి మార్కెటింగ్, ఉద్యాన శాఖలు తీసుకోవాల్సిన చర్యలు, ఎరువులు, విత్తనాల సరఫరాపై సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదా వేసిన అమ్మకాల కోసం ఏ రైతు అయినా తన ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో నిల్వ చేయాలనుకుంటే, అలాంటి రైతులను ఎటువంటి చార్జీలు లేకుండా అనుమతించాలన్నారు. వారికి కూడా.. రాష్ట్రంలోని టోకు మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల్లో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లకు, హమాలీలు, దడువాయిలకు కూడా లాక్డౌన్ నిబంధనలు వర్తించవని జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. అయితే కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు రోజూ తమ షాప్‌లలో పనిచేస్తున్న వారందరికీ చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ శానిటైజర్లను అందించాలన్నారు. మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం చేస్తే రైతు బజార్, వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలుంటాయని హెచ్చరించారు. చెత్తను శుభ్రపరిచే కాంట్రాక్టర్లు ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేసే వాహనాలు రాష్ట్రంలో లాక్‌డౌన్‌లోనూ అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. ►అంతరాష్ట్ర సరిహద్దులను పర్యవేక్షించే పోలీసులు, కూరగాయలు, పండ్లను టోకు మార్కెట్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలించడానికి అనుమతిస్తారు. ►వీలైనంతవరకూ రైతులకు చెల్లింపులతో సహా హోల్‌సేల్ ఏఎంసీలలోని అన్ని లావాదేవీలు ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఉండాలి. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయి. ఉద్యాన శాఖ చేయాల్సింది.. వ్యవసాయ మార్కెటింగ్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ సహా జిల్లాలకు కూరగాయలు, పండ్ల సరఫరా, ధరలను పర్యవేక్షించడానికి ఉద్యాన శాఖ అంతర్గత పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తారు. జిల్లా పరిపాలన సమన్వయంతో స్థానిక మండీలు, రైతు బజార్లకు తాజా కూరగాయలు, సీజనల్ పండ్ల సరఫరాను కమిటీ నిర్ధారిస్తుంది. ►ఉద్యాన శాఖ మున్సిపల్ ప్రాంతాల్లో కూరగాయల అవసరాన్ని రోజు వారీగా అంచనా వేయాలి. ప్రస్తుత పంటల వారీగా సాగు అంచనా, ఉత్పత్తి వివరాలు సేకరించాలి. ►సంక్షోభాన్ని అధిగమించడానికి అవసరమైన పంటల కింద కూరగాయల విస్తీర్ణాన్ని పెంచే భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలి. ►ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కూరగాయలను రవాణా చేయకుండా ఉండటానికి ఎక్కడి వారి అవసరాలకు అక్కడే పండించుకునేలా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలి. విత్తనాలు, ఎరువులకు ఇలా.. ►ఇక విత్తనాలను రైతుల పొలాల నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్లకు, ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఇతర ప్రాసెసింగ్ ప్లాంట్లకు, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల నుంచి రిటైలర్లకు తీసుకెళ్ళే వాహనాలు తగిన తనిఖీల తర్వాత ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అనుమతిస్తారు. విత్తన కంపెనీలు కచ్చితంగా సూచనలు పాటించాల్సిందే. ►విత్తన డీలర్లు లాక్ డౌన్ కాలంలో పనిచేయాల్సిందే. అన్ని ఎరువుల డీలర్ దుకాణాలు తెరిచి ఉంటాయి. ►ఎరువుల లోడ్, అన్లోడ్ చేయటంలో పాల్గొనే హమాలీ యూనియన్లు, లారీ రవాణా సంఘాలు, ఇతర సిబ్బంది, ఏజెంట్లు, స్థానిక కాంట్రాక్టర్లు కోవిడ్ భద్రతా చర్యలను అనుసరించి కార్యకలాపాలను కొనసాగించాలి. మార్కెటింగ్ విభాగం చేయాల్సింది ►అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ మార్కె ట్ యార్డులు, రైతు బజార్లలోని అన్ని క్యాంటీన్లు, టాయిలెట్ బ్లాక్స్, వాటర్ పాయింట్స్ మొదలైన వాటిలో హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. ►ఉత్పత్తులతో పాటు మార్కెట్ యార్డ్‌లోకి ఒక వ్యక్తిని (రైతు) మాత్రమే అనుమతించాలి. ►రైతు బజార్లలో కూరగాయలు, ఇతర వస్తువుల అమ్మకాలకు సంబంధించి, క్రమబద్ధమైన కొనుగోలు కోసం ఇద్దరు కస్టమర్ల మధ్య మీటర్ కంటే ఎక్కువ దూరం ఉండేలా చూడాలి. ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు కొనుగోళ్లు జరిపే సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి. ►పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూరగాయల రేట్లను మార్కెటింగ్ అధికారులు నిరంతరం ప్రకటించాలి. -
నాణ్యమైన విద్య అందించాలి
సాక్షి, కేయూ క్యాంపస్: రాష్ట్రంలో పాఠశాల నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రమాణాలు పెంపొందించి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ, కేయూ ఇన్చార్జి వీసీ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రధానంగా హాజరు శాతం పెంచేలా కృషి చేయాలని, అధ్యాపకులు స్వీయ మూల్యం కణం బేరీజు వేసుకోవాలని సూచించారు. కేయూ ఇన్చార్జి వీసీగా నియామకమైన తర్వాత తొలిసారి సోమవారం క్యాంపస్‌కు వచ్చిన ఆయన అన్ని విభాగాల అధ్యాపకులతో నిర్వహంచిన సమావేశంలో మాట్లాడారు. కొందరు పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు లేవని, సబ్జెక్టుల అంశాలు చెప్పలేక పోతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 29 లక్షల మంది విద్యార్థులు ఉండగా నిత్యం 30శాతం మంది గైర్హాజరవుతున్నారని తెలిపా రు. ఇదే పరిస్థితి కళాశాల విద్యలోనూ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కేయూలో హాజరుశాతం గురించి అడగ్గా సైన్స్ విభాగాల్లో 80 శాతం, ఆర్ట్స్ విభాగాల్లో 50 శాతం ఉందని ఆయా విభాగాల అధిపతులు తెలిపారు. పీజీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తీరిక సమయాలు, సెలవుల్లో వారికి విద్యాబోధన చేయాలని, ఇందుకు వర్సిటీల హెచ్వోడీలు అధ్యాపకులు సహకరించాలని అన్నా రు. వనరుల కొరత సాకుగా చూపకుండా కౌన్సిలర్ సిస్టం అమలు చేయాలని తెలిపారు. ఫార్మాసీ విభాగం ప్రొఫెసర్ ఎం.సారంగపాణి మాట్లాడుతూ కేయూలో 391 అధ్యాపక పోస్టులకు 128 మంది పనిచేస్తున్నారని పలు విభాగా ల్లో ఇద్దరు ముగ్గురే ఉన్నారని, రిటైర్ అయిన సీనియర్ ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకుంటే బాగుంటుందని అనగా.. విభాగాల వారీ గా ఎంత మంది ఉన్నారు.. జాబితా తయారు చేయాలని వీసీ సూచించారు. అందులో ఉచితంగా సేవలను అందించే, గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉండేవారి జాబితా ఇస్తే ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో వసతులకు నిధులు అవసరమని, అధ్యాపకుల కొరత ఉం దని కోఎడ్యూకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సి పాల్ పి.మల్లారెడ్డి తెలుపగా ప్రతిపాదనలు ఇస్తే వచ్చే ఏడాది బడ్జెట్లో నిధులను కేటాయించేలా చూస్తానని వీసీ హామీ ఇచ్చారు. ఎమ్మెస్పీ ఐదేళ్ల కోర్సుల విద్యార్థులకు బోధన చేయడానికి అధ్యాపకుల కొరత ఉందని కెమిస్ట్రీ విభాగం అధిపతి డాక్టర్ జి.హన్మంతు అనగా రెగ్యులర్ అధ్యాపకుల నియామకం అయ్యేవరకు గెస్ట్‌ఫ్యాకల్టీగానే తీసుకోవాలని సూచించారు. మీవద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని అడగ్గా.. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీయన్ స్టడీసెంటర్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని పొలిటికల్‌సైన్స్ విభాగం అధిపతి సంజీవరెడ్డి చెప్పగా.. సెమినార్లు, వర్క్‌షాప్‌ను నిర్వహించబోతున్నట్లు కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ సుజాత మాట్లాడుతూ బయాలజీ ఉపాధ్యాయులకు వర్క్‌షాప్ నిర్వహించబోతున్నామన్నారు. కేయూ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కోల శంకర్ మాట్లాడుతూ కేయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఖాళీగా ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులను అర్హులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని కోరారు. కేయూ టెక్నికల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ విష్ణువర్ధన్, కేయూ ఎన్జీవో జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి, ఏఆర్ పెండ్లి అశోక్, డాక్టర్ మహేష్ తదితరులు వీసీతో మాట్లాడారు. సమావేశంలో రిజిస్ట్రార్ కె.పురుషోత్తంమాట్లాడారు. -
టీచర్లు లేని చోట విద్యా వలంటీర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులు ఉండీ టీచర్లు సరిపడ లేని ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో విద్యా వలంటీర్లు రానున్నారు. గతేడాది మంజూరు చేసిన 15,661 మంది విద్యా వలంటీర్లను ఈ విద్యా సంవత్సరం కోసం ఎంగేజ్ చేయాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యా బోధనకు ఆటంకం కలుగకుండా చర్యలు చేపట్టాలని మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన ఆయన బుధవారం విద్యా వలంటీర్లను నియమించేందుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో అవసరమైన పాఠశాలల్లో వారి సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో జిల్లాల్లో అందుకు అవసరమైన చర్యలపై డీఈవోలు దృష్టి సారించారు. అయితే గతేడాది పని చేసిన విద్యా వలంటీర్లనే కొనసాగించేందుకు చర్యలు చేపట్టనున్నారు. -
డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు తెరలేచింది. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే అడ్మిషన్లకు సంబంధించి దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సంస్థ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తదితరులు బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని 1,049 డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఎస్ డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ నెల 23 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. మీ సేవ, ఈ సేవ, ఆధార్ ఫోన్ లింకైన మొబైల్, హెల్ప్‌లైన్ కేంద్రాల్లో https://dost.cgg.gov.in/ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలు.. విద్యార్థుల సందేహాల నివృత్తి, సాంకేతిక సహకారం తదితర అంశాల కోసం దోస్త్ కమిటీ 75 హెల్ప్‌లైన్ కేంద్రాలను ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో.. మరో 7 కేంద్రాలను వర్సిటీల్లో ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 10 ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లను అందుబాటులో ఉంచింది. ఈ ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. బయోమెట్రిక్ (వేలిముద్రలు) అథెంటికేషన్ సమస్య ఉంటే ఇక్కడ ఐరీస్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. కాలేజీకి వెల్లకుండానే సీటు కన్ఫర్మేషన్ ఈసారి సీటు కన్ఫర్మేషన్ కోసం కాలేజీకి వెళ్లకుండా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్‌ను తెచ్చారు. నేరుగా తరగతులు ప్రారంభమయ్యే నాడే కాలేజీలో రిపోర్టు చేయొచ్చు. ఫీజుల చెల్లింపునంతా ఆన్లైన్లో చేయాలి. ఎంపిక చేసుకున్న కాలేజీకి ఈ వివరాలను సమర్పి ంచాలి. దరఖాస్తు అప్పుడే విద్యార్థి ద్వితీయ భాష వివరాలుంటాయి. కొత్త యాప్.. ఈసారి కొత్తగా దోస్త్ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్ సిస్టం ద్వారా ఇది నడుస్తుంది. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా యాప్‌ను వినియోగిచుకోవచ్చు. ఒత్తిడి చేస్తే చర్యలు: కొన్ని కాలేజీలు తమ సంస్థలోనే అడ్మిషన్లు తీసుకునేలా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు గతేడాది పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అలాంటివాటిని ఉపేక్షించం. ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించి ఆ కాలేజీని దోస్త్ నుంచి తొలగిస్తాం. ఈసారి 27 కాలేజీలు దోస్త్‌లో లేవు. మరో 20 మైనార్టీ కాలేజీలు సొంతంగా ప్రవేశాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. - తుమ్మల పాపిరెడ్డి, టీఎస్సీహెచ్ఈ చైర్మన్ -
డిగ్రీ ప్రవేశాల్లో ఆన్లైన్ రిపోర్టింగ్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు సులభంగా ఉండే ప్రవేశాల విధానానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) శ్రీకారం చుట్టింది. పలు కొత్త విధానాలను రానున్న విద్యాసంవత్సరం ప్రవేశాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. గత మూడేళ్లు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్లో చేపడుతున్నా.. సీట్లు లభించిన విద్యార్థులు మళ్లీ ఫిజికల్‌గా కాలేజీకి వెళ్లి రిపోర్టు చేయడంతో పాటు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. అయితే త్వరలో చేపట్టే ప్రవేశాల్లో ఆ విధానానికి çఫుల్స్టాప్ పెట్టాలని దోస్త్ నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో చేపట్టబోయే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో తీసుకురావాల్సిన సులభతర విధానాలపై ఉన్నత స్థాయి అధికారుల బృందం చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ తరహా విధానం.. దాదాపు 2.20 లక్షల మంది విద్యార్థులు చేరే డిగ్రీ ప్రవేశాల్లో ఇంజనీరింగ్ తరహా ప్రవేశాల విధానం తేవాలని దోస్త్ నిర్ణయించింది. సీట్లు లభించే విద్యార్థులకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అవకాశం కల్పించనుంది. అలాగే విద్యార్థులు కాలేజీలో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే అయిన టీ వాలెట్ ద్వారా (క్రెడిట్‌కార్డు/డెబిట్ కార్డు/ఇంటర్నెట్ బ్యాంకింగ్) ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దీంతో మొదటిదశలో సీటొచ్చి కాలేజీల్లో చేరిన విద్యార్థులు రెండవ, మూడో కౌన్సెలింగ్‌ల్లో స్లైడింగ్ ద్వారా మరో కాలేజీకి వెళ్లే వీలుంటుంది. ఈ క్రమంలో గతంలోలాగా కాలేజీలు విద్యార్థులను మరో కాలేజీకి వెళ్లకుండా అడ్డుకునే అవకాశముండదు. అన్ని దశల కౌన్సెలింగ్‌ల్లో పాల్గొనే చాన్స్.. గతేడాది ప్రవేశాల్లో మొదటిదశలో సీట్లు లభించిన విద్యార్థులకు రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశమే ఇవ్వలేదు. కానీ ఈసారి ఎన్ని దశల కౌన్సెలింగ్ నిర్వహిస్తే అన్ని దశల్లో పాల్గొని తమకు ఇష్టమై న కాలేజీలో చేరే అవకాశం ఉంటుంది. ఇటు ఆన్లైన్ ప్రవేశాల సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే ప్రతి సమస్యను పాత జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే 10 స్పెషల్ హెల్ప్‌లైన్ సెంటర్లలో పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. మార్పులకు సంబంధించి దోస్త్ కన్వీనర్ స్థాయిలో చేయగలిగే మార్పులను కూడా జిల్లా స్థాయిలో చేసేలా అధికారాలను కల్పించనుంది. అక్కడా పరిష్కరించలేని సమస్యలుంటే జిల్లా స్థాయిలోని స్పెషల్ హెల్ప్‌లైన్ సెంటర్ కోఆర్డినేటరే ఆ సమస్యను రాష్ట్ర స్థాయిలో కళాశాల విద్యా కమిషనర్/దోస్త్ కార్యాలయంలో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రానికి తెలియజేసేలా, సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతారు. ఇక ఈసారి విద్యార్థులు మీసేవ కేంద్రం, ఆధార్ ఆధారిత మొబైల్‌తో పాటు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే 76 హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనూ ఉచితంగా రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఈ నెల 15న జారీ చేసి, 16 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని.. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. స్లైడింగ్‌లో జాగ్రత్త: దోస్త్ కన్వీనర్ ఒకసారి సీటొచ్చిన విద్యార్థికి తర్వాత స్లైడింగ్‌లో మరో కాలేజీలో సీటొస్తే తాజాగా వచ్చిన సీటే ఉంటుందని, ముందుగా వచ్చిన సీటు ఆటోమేటిగ్గా పోతుందని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వివరించారు. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని, కాలేజీల ఆప్షన్లు ఇచ్చుకునేప్పుడు ముందుగా సీటొచ్చిన కాలేజీ కంటే మంచి కాలేజీలను ఎంచుకోవాలని, అప్పుడు అందులో సీటొస్తే వస్తుంది.. లేదంటే మొదట వచ్చిన సీటే ఉంటుంది కనుక ఇబ్బంది ఉండదన్నారు. -
ఇంటర్ ఫలితాలపై నివేదిక సమర్పించిన కమిటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డికి నివేదిక అందజేసింది. ఐదు రోజులుగా అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ శనివారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దనరెడ్డికి అధ్యయన రిపోర్ట్‌ను ఇచ్చింది. త్రిసభ్య కమిటీతో భేటీ అనంతరం జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ రిపోర్ట్ ఆధారంగా అవకతవకలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు 50వేల దరఖాస్తులు అందాయని.. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించామని తెలిపారు. చదవండి : ‘గ్లోబరీనా’దే గోల్మాల్! -
15న మండల కేంద్రాల్లో కాంగ్రెస్ సమావేశాలు
సాక్షి,హైదరాబాద్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మండల స్థాయి సమావేశాలు ఈ నెల15న మండల కేంద్రాల్లో నిర్వహించాలని డీసీసీ అధ్యక్షులను, నియోజకవర్గ బాధ్యులను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. సమావేశాలను డీసీసీ అధ్యక్షులు సమన్వయం చేయాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్ల నుంచిఅవినీతి గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ నేతలు నాగం, జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థలో అవినీతి గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గత ఐదేళ్లుగా ఈ అంశం గుర్తుకు రాలేదా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, మేధావులు టీఆర్ఎస్ను వ్యతిరేకించినందునే వారిని ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు. అవినీతి నిర్మూలనపై అంతశ్రద్ధ ఉంటే రాష్ట్రంలో ఇంత వరకు లోకాయుక్తను ఎందుకు నియమించలేద ని ప్రశ్నించారు. అవినీతి అంతం కోసం అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయా లన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయలు కమీషన్లతో సం పాదించినవి కావా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. -
‘జనార్దన్‌రెడ్డి బదిలీ సందేహాలకు తావిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆకస్మిక బదిలీ అనేక అనుమానాలు, సందేహాలకు తావిస్తోం దని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ గౌతమ్‌కుమార్‌ను, ఇప్పుడు జనార్దన్‌రెడ్డిని అదే తరహాలో బదిలీ చేయడం సరికాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసే అధికారులను ప్రభు త్వం బదిలీ చేయడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. -
మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతుల అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఏళ్ల తరబడి నలుగుతున్న ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం తెరమరుగైంది. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన సవరణ ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేయడంతో దానికోసం పట్టుపడుతున్న ప్రధాన సంఘమైన పీఆర్టీయూ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి వచ్చిన పీఆర్టీయూ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చినా, హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు వేర్వేరుగా, ఎవరి మేనేజ్మెంట్లలో వారికే పదోన్నతులు కల్పించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని, ఆ అంశాన్ని పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారని ఎమ్మెల్సీలు వెల్లడించారు. ఇందుకోసం 1,09,024 మంది టీచర్లు (ప్రభుత్వ టీచర్లు 10,817 మంది, పంచాయతీరాజ్ టీచర్లు 98,207 మంది) వేచి చూస్తున్నారని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. దీంతో పదోన్నతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ల వారీగా ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్‌అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు లభిస్తాయన్నారు. నెలకు రూ. 398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం వారు 11,363 మంది ఉన్నారని, అందులో 7,010 మంది ప్రస్తుతం పనిచేస్తుండగా, 4,353 మంది రిటైర్ అయ్యారని వివరించారు. ఇందుకు రూ. 54 కోట్లు అవుతుందని సీఎంకు వివరించారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లకు 10 నెలలకు కాకుండా 12 నెలలకు వేతనం చెల్లించాలని కోరారు. టీచర్లకు 3 నెలల మెటర్నిటీ లీవ్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్ అమలు చేయాలని, మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు సీఎంకు వివరించారు. ఈ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందిచడంతో త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, కమలాకర్‌రావు వెల్లడించారు. ఎంఈవో పోస్టులన్నీ మాకే ఇవ్వండి: జీటీఏ మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతుల కోసం సీఎం కేసీఆర్‌ను పీఆర్టీయూ ఎమ్మెల్సీలు కోరిన నేపథ్యంలో తమ మేనేజ్మెంట్ పరిధిలో ఉన్న పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ మేనేజ్మెంట్ పరిధిలోని ఎంఈవో, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, ఉప విద్యాధికారులు, డైట్ లెక్చరర్లు, బీఎడ్ లెక్చరర్లు, ఎస్సీఈఆర్టీ లెక్చరర్ పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఉన్న పంచాయతీరాజ్ టీచర్లను మాతృశాఖలకు పంపించాలని పేర్కొన్నారు. -
పీజేఆర్ ప్రజాకర్షక నేత: ఉత్తమ్
హైదరాబాద్: దివంగత నాయకుడు పి.జనార్దన్‌రెడ్డి పేదల పెన్నిధి అని, పదవులు ఆయనకు చిన్నవని, ప్రజల మనిషి కాబట్టే ఆయన మన మధ్య లేకున్నా ప్రజల హృదయాల్లో బతికే ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ మైదానంలో జరిగిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ వర్ధంతిసభ ఏర్పాటు చేశారు. ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గమే నిదర్శనమని, ఇక్కడ వీవీ ప్యాడ్లలో స్లిప్‌లు కూడా మాయమయ్యాయని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత పోలింగ్ జరిగిందో సాయంత్రం తరువాత ఇంకా ఎక్కువ పోలింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోం దన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించాలని తాము ఈసీని, ఏఐసీసీని కోరుతామని తెలిపారు. 5 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల జనగణన చేయకుండా ఇప్పుడు కోటా తగ్గించడం సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమన్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ ‘నేను పీజేఆర్ బద్ధ శత్రువులం, అంజయ్య హయాంలో ఇద్దరం పోటీ పడేవాళ్లం’అని అన్నారు. పీజేఆర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని కోరారు. సీనియర్ నేత కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ తన జీవితంలో పీజేఆర్ లాంటి వ్యక్తిని చూడలేదన్నారు. బార్బర్ షాప్, పాన్ షాప్ ప్రారంభోత్సవాలకు కూడా వెళ్లేవారన్నారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తి పీజేఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రాములునాయక్, నేతలు శంకర్రావు, కమలాకర్‌రావు పాల్గొన్నారు. -
ఓఆర్ఆర్పై టోల్ వసూలు ఉండదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న ‘ప్రగతి నివేదన సభ’కు పోటెత్తనున్న వాహనాలకు టోల్ వసూళ్ల ప్రక్రియతో ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ గండం పొంచి ఉందని ‘టోల్’ఫికర్ శీర్షికతో బుధవారం ప్రచురిత కథనంపై కదలిక వచ్చింది. సెప్టెంబర్ 2న ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 12 వరకు ఓఆర్ఆర్పై టోల్ వసూలు చేయమని హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆ రోజు టోల్ వసూలు చేయకపోవడం వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని టీఆర్ఎస్ చెల్లించాలని పేర్కొన్నారు. లక్షలాది వాహనాలు వస్తుండటంతో సెప్టెంబర్ 2న టోల్ వసూలు చేయవద్దని టీఆర్ఎస్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన దరఖాస్తును పరిశీలించిన కమిషనర్ షరతులతో కూడిన అనుమతులిచ్చారు. కొంగర కలాన్, రావిర్యాల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లేందుకు ఓఆర్ఆర్పై మార్గాల మధ్య మరిన్ని ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని దరఖాస్తులో పేర్కొన్న అంశంపై సమాధానమిస్తూ తాత్కాలిక ఎగ్జిట్ ప్రాంతాలను ముందుగా హెచ్ఎండీఏ అధికారులు పరిశీలించి నియమిత సంఖ్యలోనే అనుమతించాలని ఆదేశించారు. ట్రాక్టర్లు, ట్రాలీలు, నెమ్మదిగా వెళ్లే ఇతర వాహనాలను ఓఆర్ఆర్పై అనుమతించబోమని, అవి సర్వీసు రోడ్డు మీదుగానే వెళ్లాలని నిబంధన విధించారు. -
రోడ్లకూ దిక్కులేని ‘బంగారు తెలంగాణ’
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర మారుమూల గ్రామాల పట్ల చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ‘ఊరికి దారేది’ శీర్షికన మే 1న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ప్రస్తుతమున్న పరిస్థితిని కళ్లకు కట్టేలా చూపిన ఈ కథనంతో ప్రభుత్వ డొల్లతనం అర్థమవుతోందని విమర్శిం చారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను నిర్మిస్తామని, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 4 లైన్ల రోడ్లు, మండల కేంద్రాల నుంచి గ్రామాలకు డబుల్ లైన్ల రోడ్లు నిర్మిస్తానని ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనని ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు ఇప్పటికీ రాష్ట్రంలోని 18,946 గ్రామాలకు మట్టి రోడ్లు ఉన్నాయనే విషయం కనబడటం లేదా అని ప్రశ్నించారు. 358 గ్రామాలకు అసలు రోడ్లే లేవని పేర్కొన్నారు. -
ఎన్నికలు సమీపిస్తుంటే ఉద్యోగ నోటిఫికేషన్లా..?
సాక్షి, హైదరాబాద్: లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతుంటే వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తూ ఓట్ల రాజకీయం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్దన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 1.68 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా యని ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నేతలు చెప్పారని, అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కూడా 1.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినా నాలుగోవంతు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. -
అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి!
చిత్తూరు : ప్రేమకు మతాలు అడ్డుకావని, ఎల్లలు లేవని నిరూపించింది ఓ జంట. అమెరికాలో ఉంటున్న అమ్మాయిని, ఆంధ్రాలో ఉంటున్న అబ్బాయిని ఫేస్బుక్ కలుపగా ఇరు కుటుంబాలు వారిని ఒక్కటి చేశాయి. దీనికి చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం కోటావూరు గ్రామ పంచాయతీలోని అమరనారాయణపురం ఆలయం వేదికైంది. అబ్బాయి కుటుంబీకుల కథనం మేరకు... మదనపల్లెకు చెందిన కె.జనార్దన్‌రెడ్డి స్థానికంగా ఓ పాఠశాల యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతని మేనమామ ఆర్.రాజశేఖర్‌రాజు అలియాస్ జర్మన్‌రాజు గతంలో విదేశాల్లో గడిపారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫిద్వాహీదా, మదనపల్లెలో ఉంటున్న జనార్దన్‌రెడ్డి ఫేస్బుక్లో కలుసుకున్నారు. ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకుని ఏడాదిగా ప్రేమలో పడ్డారు. పెళ్లికి ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించారు. వివాహం కోసం అమెరికా నుంచి ఫీద్వాహిదా, ఆమె తల్లి, అక్క, మరికొందరు బంధువులు గురువారం తెల్లవారున మదనపల్లెకు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున బంధు, మిత్రుల మధ్య ఫిద్వాహీదా హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లిపీటలపై కూర్చొని జనార్దన్‌రెడ్డితో మూడుముళ్లు వేయించుకుంది. పెళ్లి కుమార్తె ముస్లిం కావడంతో వారి కుటుంబీకుల తరఫున జనార్దన్‌రెడ్డి మేనమామ జర్మన్‌రాజు కన్యాదానం చేశారు. -
45 రోజులు.. టార్గెట్ రూ.455 కోట్లు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆస్తిపన్ను వసూలు ప్రక్రియలో జిహెచ్ఎంసి వేగం పెంచింది. ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్న గడువు మరో 45 రోజులు మాత్రమే మిగిలిఉండగా ఈ రోజుల్లోనే దాదాపు రూ.455కోట్ల ఆస్తిపన్ను రాబట్టేందుకు కసరత్తు వేగం పెంచింది. ఈ మేరకు జిహెచ్ఎంసి అధికారులకు జిహెచ్ఎంసి కమిషనర్ బి జనార్ధన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31లోగా నగర పరిధిలో దాదాపు రూ.1100కోట్లు ఆస్తిపన్నుగా రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు రూ.545కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన కొద్ది రోజుల్లో మొత్తం పన్ను వసూలుకు లక్ష్యం పెట్టుకున్నారు. సర్కిళ్ల వారిగా 24మంది ప్రత్యేక అధికారులను నియమించి ప్రతి రోజు రూ.10కోట్లు రాబట్టేందుకు నిర్ణయించారు. అధికమొత్తంలో పన్ను బకాయిలు ఉన్న వారిని వ్యక్తిగతంగా కలవడం, ఫోన్, ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిళ్ల ద్వారా గుర్తుచేయడంలాంటి చర్యలు ఇందుకు అనుసరిస్తారు. బకాయిదారులకు అవసరమైతే రెడ్ నోటీసులు జారీచేయనున్నారు. దీంతోపాటు ఇప్పటివరకు ఆస్తిపన్ను మదింపు కాని భవనాలను గుర్తించడం, తక్కువ పన్ను ఉన్న భవనాలను గుర్తించి వాటి పన్ను విధింపును నియమ నిబంధనలను అనుసరించి సరిచేయాలని అధికారులకు కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు పొందేందుకు ముందుగానే పన్ను చెల్లించాలనే విషయాలను ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరచాలని కూడా కోరారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం, నగరంలో ఆస్తిపన్ను వివాదాల పరిష్కారానికై ఈ నెల 21న అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆస్తిపన్ను విషయంలో వ్యత్యాసాలు, పన్నుదారుల సమస్యలు, ఇతర లీగల్ అంశాలను సామరస్యంగా అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలుగా 21న ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సర్కిళ్ల డిప్యూటి కమిషనర్లతో సహా అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది పాల్గొని సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరిస్తారని వివరించారు. గ్రేటర్లో ఉన్న 14 లక్షల ప్రాపర్టీల్లో దాదాపు 5లక్షల ప్రాపర్టీలకు ప్రభుత్వం ప్రకటించిన ఆస్తిపన్ను మినహాయింపు లభించిందని, మిగిలిన 8లక్షల ఆస్తులకు సంబంధించి పన్నును వసూలు చేయడంలో శ్రద్ధ చూపించాలన్నారు. -
కరువు మండలాలను ప్రకటించాలి: నాగం
నాగర్‌కర్నూల్‌టౌన్: టీఆర్ఎస్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించకుండా మీనమేషాలు లెక్కించడం తగదని మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్ర భుత్వం నివేదిక పంపిన తర్వాతనే కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి పరిస్థితిని పరిశీలిస్తుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం గా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి జిల్లాలోని గుడిపల్లి, జొన్నలబొగుడ రిజ ర్వాయర్లను పరిశీలించి వెళ్లారే తప్ప పనులు ప్రారంభించలేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలను భయపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే అయ్యప్ప సొసైటీని కూ ల్చివేసేందుకు నిర్ణరుుంచిందన్నారు. మెట్రో రైలు, వినాయక్ సాగర్‌లపై చూపుతున్న శ్రద్ధ గ్రామీణ ప్రాంతాలపై కూడా చూపాలని కోరారు. మార్కెట్ యార్డుల్లో మద్దతు ధర లేక, సంచులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి లిఫ్టులో సంప్‌హౌస్, సర్జిఫుల్ లో నాసిరకం పనులు చేశారని, మూడో లిఫులో ఎనిమిది నెలలుగా పనులు ఆగిపోయాయన్నారు. గతంలో పింఛన్ అందుకున్న ప్రతి వృద్ధురాలికి పింఛన్ అందజేయాలన్నారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు నమోదు చేయించుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు నాగం శశిధర్‌రెడ్డి, కాశన్న, బాలగౌడ్, షఫి, నసీర్, తదితరులు ఉన్నారు. -
టీడీపీలో రాజ్యసభ లొల్లి
సాక్షి, నెల్లూరు: సార్వత్రి ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీలో అప్పుడే పదవుల కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ పదవి ఖాళీ అయినా అది తమకేనంటూ నేతలు పోటీ పడుతున్నారు. పదవి తమకంటే తమకంటూ బలప్రదర్శనలకు దిగుతున్నారు. టీడీపీ ముఖ్యనేతలు ఒక్కొక్కరికి ఒకరు మద్దతు పలుకుతుండడంతో టీడీపీలో అంతర్గతపోరు తీవ్రమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీ కాలం 2016 ఏప్రిల్ వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ స్థానాన్ని భర్తీ చేసే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి ఈ స్థానం దక్కే అవకాశం ఉంది. అది కూడా జిల్లాకు చెందిన నేత మృతిచెందడంతో ఏర్పడిన ఖాళీ కావడంతో పలువురి దృష్టి దానిపై పడింది. ఎలాగైనా పదవి దక్కిచుకోవాలని ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఈ పదవి తమకంటే తమకంటూ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఆదాల ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు సర్వేపల్లి నుంచి మరోమారు ఓటమిపాలైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీపడుతున్నారు. వీళ్లు చాలరన్నట్లు అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందిన పయ్యావుల కేశవ్ సైతం రాజ్యసభ స్థానం కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. నెల్లూరు ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని, కీలక సమయంలో జిల్లాలో టీడీపీని బతికించిన తనకు ఆ పదవి కట్టబెట్టాలని చంద్రబాబును ఆదాల కోరినట్లు తెలుస్తోంది. ఆయనకు టీడీపీ ముఖ్యనేత కంభంపాటి రామ్మోహన్రావు మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఇటీవలే టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచి వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమిపాలైన మాగుంట శ్రీనివాసులురెడ్డి దృష్టి కూడా రాజ్యసభ సీటుపై పడింది. ఆయన ఈ విషయమై రెండు రోజుల క్రితమే పార్టీ ముఖ్య నేతలను సంప్రదించినట్లు సమాచారం. మాగుంటకు సుజనాచౌదరి మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని పదవులకూ పోటీ పడుతూ భంగపడుతున్న పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సైతం ఒక్క అవకాశం అంటూ రాజ్యసభ సభ్యత్వంకోసం పోరు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా రాజ్యసభ అడిగానని, అనవసరంగా సర్వేపల్లి నుంచి పోటీచేయించి మరోమారు ఓటమికి గురిచేశారని, కనీసం రాజ్యసభ అయినా ఇచ్చి పరువు నిలపాలని సోమిరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో లాబీయింగ్ నడుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఓటమి చెందిన పలువురు టీడీపీ నేతలు సైతం ఈ సీటును ఆశిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఓటమిచెందిన పయ్యావుల కేశవ్ తనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టాలంటూ ఏకంగా టీడీపీ అధినేత పైనే వత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కేశవ్ శనివారం చంద్రబాబును కలిసి కోరినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం ఆదాల వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
మందకొడి గా ఆస్తి పన్ను వసూళ్లు
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఆస్తి పన్ను వసూళ్లపై మునిసిపాలిటీ రెవెన్యూ సిబ్బంది తగిన శ్రద్ధ చూపకపోవడంతో 2013 చివరి అర్ధ సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాలకు సంబంధించి ఆస్తి పన్ను మొత్తం డిమాండ్ రూ.34.40 కోట్లు ఉండగా ఇప్పటి దాకా రూ.13.76 కోట్లు మాత్రమే వసూలైంది. ఇందులో డిమాండ్‌లో 56.89 శాతం వసూళ్లు సాధించి రాయదుర్గం మునిసిపాలిటీ ప్రథమస్థానంలో ఉండగా, 12.95 శాతం వసూళ్లతో పుట్టపర్తి చివరి స్థానంలో ఉంది. మిగతా వాటిలో నాలుగు మునిసిపాలిటీలు మాత్రమే లక్ష్యంలో 40 శాతం పైగా సాధించాయి. ఈ నెల 23న ఈ విషయంపై డీఎంఏ జనార్దన్ రెడ్డి మునిసిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వంద శాతం పన్ను వసూలుకు అవసరమైన సూచనలిచ్చారు. మొండి బకాయిల వసూలుకు అనుసరించాల్సిన పద్ధతులపై డీఎంఏ తగిన సూచనలిచ్చినా, ఆ దిశలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరుకు ఆస్తి పన్ను 50 శాతం మించే అవకాశం కనిపించడం లేదు.