అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఆస్తి పన్ను వసూళ్లపై మునిసిపాలిటీ రెవెన్యూ సిబ్బంది తగిన శ్రద్ధ చూపకపోవడంతో 2013 చివరి అర్ధ సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాలకు సంబంధించి ఆస్తి పన్ను మొత్తం డిమాండ్ రూ.34.40 కోట్లు ఉండగా ఇప్పటి దాకా రూ.13.76 కోట్లు మాత్రమే వసూలైంది. ఇందులో డిమాండ్‌లో 56.89 శాతం వసూళ్లు సాధించి రాయదుర్గం మునిసిపాలిటీ ప్రథమస్థానంలో ఉండగా, 12.95 శాతం వసూళ్లతో పుట్టపర్తి చివరి స్థానంలో ఉంది.
మిగతా వాటిలో నాలుగు మునిసిపాలిటీలు మాత్రమే లక్ష్యంలో 40 శాతం పైగా సాధించాయి. ఈ నెల 23న ఈ విషయంపై డీఎంఏ జనార్దన్ రెడ్డి మునిసిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వంద శాతం పన్ను వసూలుకు అవసరమైన సూచనలిచ్చారు. మొండి బకాయిల వసూలుకు అనుసరించాల్సిన పద్ధతులపై డీఎంఏ తగిన సూచనలిచ్చినా, ఆ దిశలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరుకు ఆస్తి పన్ను 50 శాతం మించే అవకాశం కనిపించడం లేదు.
మందకొడి గా ఆస్తి పన్ను వసూళ్లు
Published Wed, Dec 25 2013 1:58 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement