నాగర్‌కర్నూల్‌టౌన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించకుండా మీనమేషాలు లెక్కించడం తగదని మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్ర భుత్వం నివేదిక పంపిన తర్వాతనే కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి పరిస్థితిని పరిశీలిస్తుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం గా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి జిల్లాలోని గుడిపల్లి, జొన్నలబొగుడ రిజ ర్వాయర్లను పరిశీలించి వెళ్లారే తప్ప పనులు ప్రారంభించలేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలను భయపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే అయ్యప్ప సొసైటీని కూ ల్చివేసేందుకు నిర్ణరుుంచిందన్నారు. మెట్రో రైలు, వినాయక్ సాగర్‌లపై చూపుతున్న శ్రద్ధ గ్రామీణ ప్రాంతాలపై కూడా చూపాలని కోరారు.
మార్కెట్ యార్డుల్లో మద్దతు ధర లేక, సంచులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి లిఫ్టులో సంప్‌హౌస్, సర్జిఫుల్ లో నాసిరకం పనులు చేశారని, మూడో లిఫులో ఎనిమిది నెలలుగా పనులు ఆగిపోయాయన్నారు. గతంలో పింఛన్ అందుకున్న ప్రతి వృద్ధురాలికి పింఛన్ అందజేయాలన్నారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు నమోదు చేయించుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు నాగం శశిధర్‌రెడ్డి, కాశన్న, బాలగౌడ్, షఫి, నసీర్, తదితరులు ఉన్నారు.
కరువు మండలాలను ప్రకటించాలి: నాగం
Published Thu, Dec 11 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement