సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి బీ.జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. సీఎస్‌కు పంపించినట్లు సమాచారం.
మరో రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీఎస్పీఎస్సీ నియామకాలకు సంబంధించి సమీక్ష జరగనుంది. తెలంగాణ ఏర్పాడినప్పటి నుంచి.. ఇప్పటిదాకా జరిగిన నియామకాల ప్రక్రియకు సంబంధించి పూర్తి ఫైళ్లతో సమీక్షకు రావాలని సీఎంవో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు పంపింది. అయితే ఈలోపే ఆయన తన పదవికి రాజీనామా చేయడం, దానిని గవర్నర్ ఆమోదించడం జరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment