సాక్షి,హైదరాబాద్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మండల స్థాయి సమావేశాలు ఈ నెల15న మండల కేంద్రాల్లో నిర్వహించాలని డీసీసీ అధ్యక్షులను, నియోజకవర్గ బాధ్యులను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. సమావేశాలను డీసీసీ అధ్యక్షులు సమన్వయం చేయాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
గత ఐదేళ్ల నుంచిఅవినీతి గుర్తుకు రాలేదా?
కాంగ్రెస్ నేతలు నాగం, జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థలో అవినీతి గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గత ఐదేళ్లుగా ఈ అంశం గుర్తుకు రాలేదా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, మేధావులు టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించినందునే వారిని ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు. అవినీతి నిర్మూలనపై అంతశ్రద్ధ ఉంటే రాష్ట్రంలో ఇంత వరకు లోకాయుక్తను ఎందుకు నియమించలేద ని ప్రశ్నించారు. అవినీతి అంతం కోసం అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయా లన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయలు కమీషన్లతో సం పాదించినవి కావా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment