
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూలై నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్య పరీక్షలను 6 నెలల్లో పూర్తిచేసి హెల్త్ కార్డులివ్వాలని అధికారులకు సూచించారు.
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలపై ఇద్దరు మంత్రులు బుధవారం సచివాలయంలో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల విద్యాలయాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేజీబీవీలు, గురుకుల విద్యా లయాలు, మోడల్ స్కూళ్లలోని 3 లక్షల మందికి విద్యా శాఖ కిట్స్ ఇస్తుందని, మిగతా 5 లక్షల మందికి ఇరు శాఖలు సంయుక్తంగా కిట్స్ అందజేయాలన్నారు. 7, 8, 9, 10వ తరగతి విద్యార్థినులకు యుక్త వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలు, సంరక్షణపై అవగాహన తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment