సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా టీఆర్‌ఎస్ నుంచి జాతీయ పార్టీ ఆవిర్భావ నేపథ్యంలో నగరంలో కోలాహలం నెలకొంది. కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరగబోయే పార్టీ జనరల్‌బాడీ మీటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే.. ఈ మీటింగ్ కోసం పలువురు ఇతర రాష్ట్రాల నేతలకు సైతం ఆహ్వానం వెళ్లింది. ఈ క్రమంలో..
జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కుమారస్వామితో పాటు జేడీఎస్ కీలక నేత.. మాజీ మంత్రి రేవన్న, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్లు నగరానికి చేరారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కుమారస్వామి బృందానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కేటీఆర్ స్వాగతం పలికారు. చీఫ్ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు.
నగరంలోని తెలంగాణ భవన్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌లో జేడీఎస్ కుమారస్వామి సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
అంతకు ముందు.. తమిళనాడుకు చెందిన విడుత్తలై చిరుత్తైగల్ కట్చీ (వీసీకే) అధినేత, ఎంపీ తిరుమావలవన్ కూడా నగరానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిలు ఆయనకు స్వాగతం పలికారు.
Received Viduthalai Chiruthaigal Katchi Party President, Member of Parliament and Dalit leader from Tamilnadu Sri @thirumaofficial in Hyderabad today. pic.twitter.com/BSUHfdPhrz
— Balka Suman (@balkasumantrs) October 4, 2022
Comments
Please login to add a commentAdd a comment