KCR New Party
-
ఢిల్లీలో కేసీఆర్ BRS జెండా ఎగరేస్తారా ..?
-
ఎడిటర్ కామెంట్ : బీఆర్ఎస్ కు ఆంధ్రప్రదేశ్ టఫ్ టాస్క్
-
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు : ఎమ్మెల్యే సుధాకర్ బాబు
-
కోట్లు పెట్టి ప్రజలను కొనాలని బీజేపీ చూస్తోంది : మంత్రి హరీష్ రావు
-
BRS తో కేసీఆర్ దేశానికి చేసేదేమి లేదు : నిర్మలా సీతారామన్
-
గన్ షాట్ : కేసీఆర్ పాన్ ఇండియా పార్టీ సక్సెస్ అవుతుందా ...?
-
TRS ను BRS గా మార్చడంతో ఒరిగేదేమి లేదు : తరుణ్ చుగ్
-
బీఆర్ఎస్ కు జెండా లేదు , అజెండా లేదు : బండి సంజయ్
-
ఏపీలో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి : మంత్రి బొత్స
-
ఢిల్లీ : సీఈసీని కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
-
కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ..?
-
కారుకు అండగా ఉండేదెవరు? ప్రత్యర్థిగా మారెదెవరు?
దక్షిణ భారత దేశంలోనూ పలు ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. మాజీ ప్రధాని జేడీఎస్ నాయకులు దేవెగౌడతోపాటు ఆయన కుమారుడు కుమారస్వామితో కేసీఆర్ పలుమార్లు భేటీ అయ్యారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బలంగా ఉన్న జేడీఎస్ ఇప్పుడు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలాకాలంగా అటు బీజేపీతో కాని ఇటు కాంగ్రెస్‌తో పాటు కర్ణాటకలో పొత్తులు పెట్టుకున్న దేవెగౌడ పార్టీ మళ్లీ ఈ పార్టీల వైపే మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం జేడీఎస్ బలంగా లేని బెంగుళూర్ లాంటి ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు కేసీఆర్ గుర్తుపై పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ఇటీవలే అధికారంతో పాటు పార్టీని పొగొట్టుకున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తమతో కలిసే అవకాశాలున్నాయని గులాబీ నేతలు చెబుతున్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని పలు నియోజకవర్గాలతోపాటు మహారాష్ట్రలో ఉద్ధవ్‌తో కలిసి పోటీ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలంటున్నారు. ఇక తమిళనాట స్టాలిన్‌తోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్ పార్టీతో చాలాకాలంగా మితృత్వం నెరుపుతున్న స్టాలిన్ గులాబీ పార్టీతో దోస్తీకి అంతగా ఆసక్తి చూపే అవకాశాలు లేవు. అయితే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీఆర్ఎస్కు మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ విభజనే లక్ష్యంగా పుట్టిన గులాబీ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సహజమైన వ్యతిరేక భావన ఉంది. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పార్టీని అంగీకరించడం అంత సులువైన పనికాదు. ఇప్పటికే నిలదొక్కుకున్న రాజకీయ పార్టీలు తమ రాష్ట్రాల్లోకి బీఆర్ఎస్ను స్వాగతించే అవకాశాలు చాలా తక్కువ. అందుకే చిన్న చిన్న పార్టీలను విలీనం చేసుకోవడం ద్వారా పార్టీని విస్తరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఒకరిద్దరు ఎంపీలున్న పార్టీలకు ఆర్ధిక అండదండాలు అందించి వాటిని విలీనం చేసుకోవడం మంచి స్ట్రాటజీగా గులాబీ నాయకులు భావిస్తున్నారు. అందుకే తమిళనాడుకు చెందిన విదుతాలై చిరుతైగల్ కట్చె అధ్యక్షుడు తిరుమావళవన్ పార్టీ నామకరణం కార్యక్రమానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి పార్టీలతో చర్చలు జరిపి వివిధ రాష్ట్రాల్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసేందుకు కేసీఆర్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. దీంతోపాటు స్వతంత్ర్యంగా గెలవగలిగే సత్తా ఉన్న నాయకుల కోసం బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా వేట ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి నేతలు బీఆర్ఎస్ జెండాను అన్ని రాష్ట్రాల్లో ఎగరవేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయడం జాతీయ పార్టీ గుర్తంపు తెచ్చుకోవడమే ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న అతిపెద్ద వ్యూహంగా చెబుతున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో గెలవాలనుకుంటున్న బీఆర్ఎస్ ముందుగా 2023లో జరిగే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కుంటుందనేదే అతి పెద్ద చాలెంజ్. 2023లో తెలంగాణాలో భారీ మెజార్టీ సాధిస్తేనే బీఆర్ఎస్ విస్తరణ సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. లేదంటే అసలుకే మోసం జరిగే ప్రమాదం ఉంది. ఇది కూడా చదవండి: KCR TRS To BRS: పార్టీ పేరు మారిపోయింది.. కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ? -
పార్టీ పేరు మారిపోయింది.. కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ?
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం నినాదంతో పురుడుపోసుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి ఇప్పుడు పేరు మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ఇంట గెలిచాక రచ్చ గెలవాలనే చందంగా ఇప్పుడు ఢిల్లీ గద్దెమీద జెండా ఎగరవేస్తామని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే పార్టీ విస్తరణ ఎలా జరుగుతుందనే విషయంపై మాత్రం ఎవరి వద్ద స్పష్టత లేదు. పార్టీ పేరు మార్పు సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమారస్వామితో పాటు ఆయన పార్టీ నేతలు హాజరయ్యారు. తమిళనాడుకు చెందిన ఒకరిద్దరు నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల ప్రతినిధులు సైతం బీఆర్ఎస్ నామకరణానికి వచ్చారు. అయితే కేసీఆర్ పార్టీలో వీరైనా చేరతారా అనే విషయంపై క్లారిటీ లేదు. చదవండి: టీఆర్ఎస్ ఇక కనుమరుగు.. 21 ఏళ్ల తర్వాత.. పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడానికి ముందే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ భారీ కసరత్తు చేశారు. దేశవ్యాప్తంగా చాలామంది ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు. జాతీయ స్థాయిలో బీజేపీ-కాంగ్రేసేతర కూటమి కోసం ప్రయత్నాలు చేశారు. 2018లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో గెలిచిన తరువాత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ చర్చలు అంతగా ఫలించలేదనేది.. తరువాతి కాలంలో టీఆర్ఎస్తో కూటమికి మమతా అంతగా మొగ్గుచూపలేదనే వార్తలు వచ్చాయి. ఇక గత నాలుగేళ్లలో మళ్లీ ఈ ఇద్దరు నేతల మధ్య ఎలాంటి భేటీలు జరగలేదు. యూపీ, బీహార్లలో అటు సమాజ్‌వాది పార్టీ ఇటు ఆర్జేడీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ దాదాపు నాలుగుసార్లు భేటీ అయ్యారు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కేసీఆర్‌తో భేటీ అయిన అఖిలేష్ హైదరాబాద్‌కు కూడా వచ్చారు. ఆర్జేడీ నేత లాలూతోనూ కేసీఆర్ మంతనాలు జరిపారు. అయితే నితీష్‌తో కేసీఆర్ మంతనాలు అనుకున్న ఫలితాలనివ్వలేదని జేడీయూ వర్గాలు చెప్పాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీతోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్ సంక్షేమ పథకాలను పరిశీలించారు. చనిపోయిన రైతులకు పంజాబ్ వెళ్లి ఆర్ధిక సహాయం చేశారు. అయితే ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం నేపధ్యంలో ఆప్ నాయకులపై ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం టీఆర్ఎస్కు చుట్టుకుంది. ఇక టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీలు టీఆర్ఎస్ కంటే పెద్దవి. ఉత్తర భారతంలో చక్రం తిప్పిన చరిత్ర ఈ పార్టీలకంది. ఇలాంటి నేపధ్యంలో ఈ పార్టీలు తమ రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు విస్తరించే అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే 2024 ఎన్నికల తరువాత కూటమి కోసం మాత్రమే ఈ పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. -
KCR Party: బీఆర్ఎస్పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేసిన జాతీయపార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయస్థాయిలో విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలని, దేశమంతటా తెలంగాణ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేకాకుండా కర్ణాటకలో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామన్నారు. ఈ క్రమంలోను తమ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో కలిసి పనిచేస్తారని చెప్పారు. చదవండి: (KCR: టీఆర్ఎస్ ఇక కనుమరుగు.. 21 ఏళ్ల తర్వాత..) -
సీఎం కేసీఆర్ పై దళిత నేత, తిరుమావళవన్ ప్రశంసలు
-
BRS పార్టీ ఏర్పాటుపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
-
బీజేపీని ఓడించే దిశగా కేసీఆర్ అడుగులు వేయాలి : సీపీఐ నారాయణ
-
బహుశా ప్రపంచ రాష్ట్ర సమితి కూడా పెడతారేమో : రేవంత్ రెడ్డి
-
ఉద్యమ పార్టీని కేసీఆర్ ఖతం చేశారు : ఈటెల రాజేందర్
-
యధావిధిగా కొనసాగనున్న పార్టీ గుర్తు ,జెండా
-
రాబోయే కాలంలో దేశ వ్యాప్తంగా పోటీ చేస్తాం : తలసాని శ్రీనివాస్ యాదవ్
-
21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు
-
టీఆర్ఎస్ TO బీఆర్ఎస్...కేసీఆర్ స్పీచ్
-
ఇక నుంచి బీఆర్ఎస్ గా టీఆర్ఎస్
-
టీఆర్ఎస్ టూ బీఆర్ఎస్.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో మార్పు కోసమే తన ప్రయత్నమని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తున్నట్లు ఆయన బుధవారం అధికారికంగా ప్రకటించారు. సర్వ సభ్య సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలకు ఏమి కావాలో బీజేపీ, కాంగ్రెస్ గుర్తించట్లేదు. తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం. దేశ ప్రజలకు ఇచ్చే హామీలనూ అమలు చేస్తాం. అన్ని పక్షాలు బీఆర్ఎస్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని’’ కేసీఆర్ అన్నారు. చదవండి: టీఆర్ఎస్ ఇక కనుమరుగు.. 21 ఏళ్ల తర్వాత.. తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటుచేసుకుంది. జాతీయ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భావించింది. జాతీయ పార్టీకి సంబంధించిన పేపర్లపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. పార్టీ పేరును బీఆర్ఎస్గా సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. నేటి నుంచి టీఆర్ఎస్ కనుమరుగు కానుంది. టీఆర్ఎస్ స్థానంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావించింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ అవతరించింది.