
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేసిన జాతీయపార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జాతీయస్థాయిలో విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలని, దేశమంతటా తెలంగాణ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేకాకుండా కర్ణాటకలో బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. ఈ క్రమంలోను తమ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో కలిసి పనిచేస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment