
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారుస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బుధవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో నేటి నుంచి టీఆర్‌ఎస్ పేరు కనుమరుగు కానుంది. 2001 జలదృశ్యం సభలో టీఆర్‌ఎస్ అవతరించింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ.. బీఆర్‌ఎస్‌గా మార్పు చెందుతూ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది.
జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన ముద్ర వేస్తూ.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతి పథంలో నడవాలనే ముఖ్య ఉద్ధేశ్యంతో టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా మార్పుచెందింది.
చదవండి: (టీఆర్‌ఎస్ ఇక బీఆర్‌ఎస్.. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు)