KCR National Party
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
రాష్ట్రాల హక్కులను మోడీ కాలరాస్తున్నారు: కేరళ సీఎం పినరయి విజయన్
-
ఢిల్లీలో కేసీఆర్ BRS జెండా ఎగరేస్తారా ..?
-
KCR BRS: కిక్కిరిసిన తుగ్లక్ రోడ్డు.. బిజీబిజీగా కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన ఉద్యమం, ఉత్తరాది రాష్ట్రాల్లో కలిసొచ్చే పార్టీలు, సంఘాలు, పార్టీ ప్రధాన ఎజెండా తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాదికి చెందిన నేతలు, రైతు సంఘాల నాయకులతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు, రైతులే కీలకం కావడంతో.. వారి ఎజెండాతోనే ముందుకు పోవాలనే లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రైతు ఉద్యమ నిర్మాణం, వ్యవసాయ కేంద్రీకృత అంశాలపై విస్తృత చర్చలు జరుపుతున్నారు. ధాన్యం సేకరణ, గోధుమ సాగుపై చర్చలు రైతు ఎజెండానే తమ తొలి ప్రాధాన్యమని చాటేలా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్ఎస్ కిసాన్ సెల్)ని ఏర్పాటు చేయడంతో పాటు దానికి అధ్యక్షునిగా రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చడూనీని కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. తన నియామకంపై కృతజ్ఞతలు తెలియజేసేందుకు.. గుర్నామ్ సింగ్‌తో పాటు పంజాబ్, హరియాణాకు చెందిన రైతులు గురువారం తుగ్లక్ రోడ్డులోని సీఎం అధికారిక నివా సంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రస్తుత ఖరీఫ్‌లో వరి ధాన్యం సేకరణ, దానికి అనుసరిస్తున్న విధానాలు, గోధుమల సాగు లో తలెత్తే సమస్యలు, పంట వ్యర్ధాల దహనం, ప్రభుత్వ విధానాలు, తదితర అంశాలపై చర్చించారు.పంటల సేకరణలో జాతీయ విధానం, మద్దతు ధరలు, వ్యవసాయంలో సంప్రదాయ దేశీయ పద్ధతులకు ప్రోత్సాహం వంటి అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. సాగు నీటి రంగంలో తెలంగాణ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, విద్యుత్ సంస్కరణలు, వివిధ వృత్తుల వారికి సామాజిక భద్రత వంటి అంశాలపై మాట్లాడినట్లు చెబుతున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులనే జాతీయ స్థాయి లో అమలు చేసేలా ఎజెండాను రూపొందిద్దామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒవైసీ భేటీ.. కుమార్తె వివాహానికి ఆహ్వానం! మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఏర్పాటుపై ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతీయ స్థాయిలో కలిసి ఉద్యమించే అంశాలు, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన విషయాలపై ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. కిక్కిరిసిన తుగ్లక్ రోడ్డు బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రెండోరోజు కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర సందర్శకుల రాకతో ఆయన బిజీబిజీగా గడిపారు. తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు, ఉత్తరాది నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన రైతు సంఘాల నేతలు, ప్రముఖులను పలుకరించిన ముఖ్యమంత్రి వారితో ఫొటోలు దిగారు. సందర్శకుల తాకిడితో తుగ్లక్ రోడ్డు పరిసర ప్రాంతాలు జన సందోహంతో కిక్కిరిశాయి. ఇలావుండగా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి పయనమైన నేతలకు విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపించాయి. గరిష్టంగా రూ.50 వేల వరకు పలకడంతో చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఉద్యమ కార్యాచరణపై త్వరలో ప్రకటన! రాజస్థాన్‌కు చెందిన రాష్ట్రీయ్ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) నేషనల్ కన్వీనర్, ఎంపీ హనుమాన్ బేనివాల్, ఒడిశాకు చెందిన రైతు సంఘం నేత అక్షయ్ కుమార్, జహీరాబాద్‌కు చెందిన రైతు నేత ఢిల్లీ వసంత్‌లు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాల విధానాలు, చేయాల్సిన సంస్కరణలు వంటి అంశాలపై లోతుగా చర్చించారు. రైతు సంబంధిత అంశాలపై వివరాలను సేకరించిన కేసీఆర్.. త్వరలోనే పార్టీ తరఫున జాతీయ స్థాయి సమావేశం నిర్వహణ, తదనంతరం ఢిల్లీ వేదికగా చేసే ఉద్యమ కార్యాచరణపై ప్రకటన చేద్దామని చెప్పినట్లు తెలిసింది. ఇదీ చదవండి: స్పీడ్ పెంచిన గులాబీ బాస్.. ఢిల్లీ వేదికగా త్వరలో కీలక సమావేశం! -
బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్‌తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జపాన్ కంపెనీ బోష్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు కేటీఆర్.ఇందుకోసం సీఎం కేసీఆర్ అనుమతి తీసుకున్నారు. ఇదీ చదవండి: KCR BRS: మరో ప్రస్థానం -
టీఆర్ఎస్ ను BRS గా మారుస్తూ ఈసీ ఆమోదం
-
ఎడిటర్ కామెంట్ : బీఆర్ఎస్ కు ఆంధ్రప్రదేశ్ టఫ్ టాస్క్
-
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు : ఎమ్మెల్యే సుధాకర్ బాబు
-
కోట్లు పెట్టి ప్రజలను కొనాలని బీజేపీ చూస్తోంది : మంత్రి హరీష్ రావు
-
BRS తో కేసీఆర్ దేశానికి చేసేదేమి లేదు : నిర్మలా సీతారామన్
-
గన్ షాట్ : కేసీఆర్ పాన్ ఇండియా పార్టీ సక్సెస్ అవుతుందా ...?
-
TRS ను BRS గా మార్చడంతో ఒరిగేదేమి లేదు : తరుణ్ చుగ్
-
కేసీఆర్ అవినీతికి పాల్పడితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు : రేవంత్ రెడ్డి
-
2024లో కేసీఆరే ప్రధాని
నల్గొండ రూరల్ : 2024లో జరిగే ఎన్నికల్లో కేసీఆరే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఆరెగూడెం ఇన్ చార్జ్ గా నియమితులైన ఆయన శుక్రవారం ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారని, కానీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఆ రాష్ట్రాల సీఎంలకు దమ్ము సరిపోవడంలేదన్నారు. సీఎం కేసీఆర్ దమ్మున్న లీడరని, బీజేపీ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.22కోట్లకు మునుగోడు నియోజకవర్గాన్ని గుత్తకు ఇచ్చిందన్నారు. ప్రచారంలో ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరెగూడెంలో వృద్ధులతో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు రావు మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రావని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తాను ఇన్ చార్జ్ గా నియమితులైన మండలంలోని ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి, రెడ్డిబావి, సైదాబాద్ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆరెగూడెంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వృద్ధులతో, రైతులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ పథకాలను గూర్చి వివరించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మూడున్నరేళ్లలో ఏనాడూ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదన్నారు. దమ్ముంటే కేంద్రం నుంచి రూ.100కోట్లు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి తెచ్చి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పంతంగి–గుండ్లబావి రోడ్డు వేయించాలని మంత్రి జగదీశ్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు మునగాల ప్రభాకర్‌రెడ్డి, బచ్చ రామకృష్ణ, నాయకులు జక్క వెంకట్‌రెడ్డి, మంద సంజీవరెడ్డి, జాల మల్లేశ్‌యాదవ్, నందగిరి శ్యామ్, మునగాల దామోదర్‌రెడ్డి, బచ్చ మల్లేశం, పల్లె లింగస్వామి, దుర్గం రాజు, కొలను ఆగిరెడ్డి పాలొన్నారు. -
బీఆర్ఎస్ కు జెండా లేదు , అజెండా లేదు : బండి సంజయ్
-
ఏపీలో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి : మంత్రి బొత్స
-
ఢిల్లీ : సీఈసీని కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
-
కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ..?
-
కారుకు అండగా ఉండేదెవరు? ప్రత్యర్థిగా మారెదెవరు?
దక్షిణ భారత దేశంలోనూ పలు ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. మాజీ ప్రధాని జేడీఎస్ నాయకులు దేవెగౌడతోపాటు ఆయన కుమారుడు కుమారస్వామితో కేసీఆర్ పలుమార్లు భేటీ అయ్యారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బలంగా ఉన్న జేడీఎస్ ఇప్పుడు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలాకాలంగా అటు బీజేపీతో కాని ఇటు కాంగ్రెస్‌తో పాటు కర్ణాటకలో పొత్తులు పెట్టుకున్న దేవెగౌడ పార్టీ మళ్లీ ఈ పార్టీల వైపే మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం జేడీఎస్ బలంగా లేని బెంగుళూర్ లాంటి ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు కేసీఆర్ గుర్తుపై పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ఇటీవలే అధికారంతో పాటు పార్టీని పొగొట్టుకున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తమతో కలిసే అవకాశాలున్నాయని గులాబీ నేతలు చెబుతున్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని పలు నియోజకవర్గాలతోపాటు మహారాష్ట్రలో ఉద్ధవ్‌తో కలిసి పోటీ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలంటున్నారు. ఇక తమిళనాట స్టాలిన్‌తోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్ పార్టీతో చాలాకాలంగా మితృత్వం నెరుపుతున్న స్టాలిన్ గులాబీ పార్టీతో దోస్తీకి అంతగా ఆసక్తి చూపే అవకాశాలు లేవు. అయితే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీఆర్ఎస్కు మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ విభజనే లక్ష్యంగా పుట్టిన గులాబీ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సహజమైన వ్యతిరేక భావన ఉంది. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పార్టీని అంగీకరించడం అంత సులువైన పనికాదు. ఇప్పటికే నిలదొక్కుకున్న రాజకీయ పార్టీలు తమ రాష్ట్రాల్లోకి బీఆర్ఎస్ను స్వాగతించే అవకాశాలు చాలా తక్కువ. అందుకే చిన్న చిన్న పార్టీలను విలీనం చేసుకోవడం ద్వారా పార్టీని విస్తరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఒకరిద్దరు ఎంపీలున్న పార్టీలకు ఆర్ధిక అండదండాలు అందించి వాటిని విలీనం చేసుకోవడం మంచి స్ట్రాటజీగా గులాబీ నాయకులు భావిస్తున్నారు. అందుకే తమిళనాడుకు చెందిన విదుతాలై చిరుతైగల్ కట్చె అధ్యక్షుడు తిరుమావళవన్ పార్టీ నామకరణం కార్యక్రమానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి పార్టీలతో చర్చలు జరిపి వివిధ రాష్ట్రాల్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసేందుకు కేసీఆర్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. దీంతోపాటు స్వతంత్ర్యంగా గెలవగలిగే సత్తా ఉన్న నాయకుల కోసం బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా వేట ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి నేతలు బీఆర్ఎస్ జెండాను అన్ని రాష్ట్రాల్లో ఎగరవేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయడం జాతీయ పార్టీ గుర్తంపు తెచ్చుకోవడమే ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న అతిపెద్ద వ్యూహంగా చెబుతున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో గెలవాలనుకుంటున్న బీఆర్ఎస్ ముందుగా 2023లో జరిగే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కుంటుందనేదే అతి పెద్ద చాలెంజ్. 2023లో తెలంగాణాలో భారీ మెజార్టీ సాధిస్తేనే బీఆర్ఎస్ విస్తరణ సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. లేదంటే అసలుకే మోసం జరిగే ప్రమాదం ఉంది. ఇది కూడా చదవండి: KCR TRS To BRS: పార్టీ పేరు మారిపోయింది.. కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ? -
పార్టీ పేరు మారిపోయింది.. కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ?
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం నినాదంతో పురుడుపోసుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి ఇప్పుడు పేరు మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ఇంట గెలిచాక రచ్చ గెలవాలనే చందంగా ఇప్పుడు ఢిల్లీ గద్దెమీద జెండా ఎగరవేస్తామని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే పార్టీ విస్తరణ ఎలా జరుగుతుందనే విషయంపై మాత్రం ఎవరి వద్ద స్పష్టత లేదు. పార్టీ పేరు మార్పు సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమారస్వామితో పాటు ఆయన పార్టీ నేతలు హాజరయ్యారు. తమిళనాడుకు చెందిన ఒకరిద్దరు నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల ప్రతినిధులు సైతం బీఆర్ఎస్ నామకరణానికి వచ్చారు. అయితే కేసీఆర్ పార్టీలో వీరైనా చేరతారా అనే విషయంపై క్లారిటీ లేదు. చదవండి: టీఆర్ఎస్ ఇక కనుమరుగు.. 21 ఏళ్ల తర్వాత.. పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడానికి ముందే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ భారీ కసరత్తు చేశారు. దేశవ్యాప్తంగా చాలామంది ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు. జాతీయ స్థాయిలో బీజేపీ-కాంగ్రేసేతర కూటమి కోసం ప్రయత్నాలు చేశారు. 2018లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో గెలిచిన తరువాత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ చర్చలు అంతగా ఫలించలేదనేది.. తరువాతి కాలంలో టీఆర్ఎస్తో కూటమికి మమతా అంతగా మొగ్గుచూపలేదనే వార్తలు వచ్చాయి. ఇక గత నాలుగేళ్లలో మళ్లీ ఈ ఇద్దరు నేతల మధ్య ఎలాంటి భేటీలు జరగలేదు. యూపీ, బీహార్లలో అటు సమాజ్‌వాది పార్టీ ఇటు ఆర్జేడీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ దాదాపు నాలుగుసార్లు భేటీ అయ్యారు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కేసీఆర్‌తో భేటీ అయిన అఖిలేష్ హైదరాబాద్‌కు కూడా వచ్చారు. ఆర్జేడీ నేత లాలూతోనూ కేసీఆర్ మంతనాలు జరిపారు. అయితే నితీష్‌తో కేసీఆర్ మంతనాలు అనుకున్న ఫలితాలనివ్వలేదని జేడీయూ వర్గాలు చెప్పాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీతోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్ సంక్షేమ పథకాలను పరిశీలించారు. చనిపోయిన రైతులకు పంజాబ్ వెళ్లి ఆర్ధిక సహాయం చేశారు. అయితే ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం నేపధ్యంలో ఆప్ నాయకులపై ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం టీఆర్ఎస్కు చుట్టుకుంది. ఇక టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీలు టీఆర్ఎస్ కంటే పెద్దవి. ఉత్తర భారతంలో చక్రం తిప్పిన చరిత్ర ఈ పార్టీలకంది. ఇలాంటి నేపధ్యంలో ఈ పార్టీలు తమ రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు విస్తరించే అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే 2024 ఎన్నికల తరువాత కూటమి కోసం మాత్రమే ఈ పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. -
సీఎం కేసీఆర్ పై దళిత నేత, తిరుమావళవన్ ప్రశంసలు
-
BRS పార్టీ ఏర్పాటుపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
-
బీజేపీని ఓడించే దిశగా కేసీఆర్ అడుగులు వేయాలి : సీపీఐ నారాయణ
-
బహుశా ప్రపంచ రాష్ట్ర సమితి కూడా పెడతారేమో : రేవంత్ రెడ్డి
-
ఉద్యమ పార్టీని కేసీఆర్ ఖతం చేశారు : ఈటెల రాజేందర్
-
యధావిధిగా కొనసాగనున్న పార్టీ గుర్తు ,జెండా
-
రాబోయే కాలంలో దేశ వ్యాప్తంగా పోటీ చేస్తాం : తలసాని శ్రీనివాస్ యాదవ్
-
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ స్పందన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని స్థాపించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పేరు మారుస్తూ తీర్మానం చేయడాన్ని ఈటల తీవ్రంగా తప్పుబట్టారు. ‘బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయింది. ఉద్యమ పార్టీని కతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటల్లు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారు. ఆ పార్టీ స్థాపనతోనే తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమ కారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయింది. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయ చెలామణి చేయాలని పగటికలకంటున్నారు. కూట్లో రాయి తీయలేనివాడు.. ఏట్లో రాయి తీయడానికి పోయినట్లు ఉంది’ అని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. -
21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు
-
టీఆర్ఎస్ TO బీఆర్ఎస్...కేసీఆర్ స్పీచ్
-
‘తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయింది’
హైదరాబాద్: జాతీయ రాజకీయాలే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా పేరు మారుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు(బుధవారం) తీర్మానం చేయడంపై టీపీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2001 నుంచి 2022 వరకూ తెలంగాణ పేరుతో ఆర్థికంగా బలోపేతం అయిన కేసీఆర్.. తెలంగాణ అస్థిత్వాన్ని చంపేశారని మండిపడ్డారు. ‘తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని ఆయన గ్రహించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయింది. తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్. తెలంగాణ అనే పదం ఇక్కడిప్రజల జీవన విధానంలో భాగం. తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్న హంతకుడు కేసీఆర్. ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్ కు అర్హత లేదు. తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలి. ప్రజల్ని మభ్య పెట్టడానికే బీఆర్ఎస్. ఆ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోండి. దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టండి. నేను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకుంటా. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం’ అని వ్యాఖ్యానించారు రేవంత్‌రెడ్డి. -
టీఆర్ఎస్ టూ బీఆర్ఎస్.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో మార్పు కోసమే తన ప్రయత్నమని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తున్నట్లు ఆయన బుధవారం అధికారికంగా ప్రకటించారు. సర్వ సభ్య సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలకు ఏమి కావాలో బీజేపీ, కాంగ్రెస్ గుర్తించట్లేదు. తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం. దేశ ప్రజలకు ఇచ్చే హామీలనూ అమలు చేస్తాం. అన్ని పక్షాలు బీఆర్ఎస్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని’’ కేసీఆర్ అన్నారు. చదవండి: టీఆర్ఎస్ ఇక కనుమరుగు.. 21 ఏళ్ల తర్వాత.. తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటుచేసుకుంది. జాతీయ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భావించింది. జాతీయ పార్టీకి సంబంధించిన పేపర్లపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. పార్టీ పేరును బీఆర్ఎస్గా సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. నేటి నుంచి టీఆర్ఎస్ కనుమరుగు కానుంది. టీఆర్ఎస్ స్థానంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావించింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ అవతరించింది. -
కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావం (ఫొటోలు)
-
KCR: టీఆర్ఎస్ ఇక కనుమరుగు.. 21 ఏళ్ల తర్వాత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బుధవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో నేటి నుంచి టీఆర్ఎస్ పేరు కనుమరుగు కానుంది. 2001 జలదృశ్యం సభలో టీఆర్ఎస్ అవతరించింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్గా మార్పు చెందుతూ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన ముద్ర వేస్తూ.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతి పథంలో నడవాలనే ముఖ్య ఉద్ధేశ్యంతో టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మార్పుచెందింది. చదవండి: (టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు) -
టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు..
Updates: తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటుచేసుకుంది. జాతీయ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భావించింది. జాతీయ పార్టీకి సంబంధించిన పేపర్లపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. పార్టీ పేరును బీఆర్ఎస్గా సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. నేటి నుంచి టీఆర్ఎస్ కనుమరుగు కానుంది. టీఆర్ఎస్ స్థానంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావించింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ అవతరించింది. ►టీఆర్ఎస్ పేరు మారుస్తూ ఈసీకి పార్టీ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలని టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేశారు. యథావిధిగా పార్టీ జెండా, గుర్తు కొనసాగనున్నాయి. ►జాతీయ పార్టీ కోసం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ ఆరుగురు ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో కేసీఆర్ వివరించారు. తెలంగాణ భవన్లో కీలక భేటి కొనసాగుతోంది. సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ముందుగా తెలంగాణలో భవన్లో ప్రొ.జయశంకర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, వీసీకే పార్టీ(తమిళనాడు) అధినేత తిరుమావళవన్, జాతీయ రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. చదవండి: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం చేయనున్నారు. మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీకి సంబంధించి పేపర్లపై ముహూర్తానికి సీఎం కేసీఆర్ సంతకం పెట్టనున్నారు. సమావేశం తర్వాత ప్రతినిధులు, అతిథులకు ప్రగతి భవన్లో లంచ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. -
కేసీఆర్ కొత్త పార్టీ.. జేడీఎస్ కుమారస్వామి రాక
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా టీఆర్ఎస్ నుంచి జాతీయ పార్టీ ఆవిర్భావ నేపథ్యంలో నగరంలో కోలాహలం నెలకొంది. కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరగబోయే పార్టీ జనరల్‌బాడీ మీటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే.. ఈ మీటింగ్ కోసం పలువురు ఇతర రాష్ట్రాల నేతలకు సైతం ఆహ్వానం వెళ్లింది. ఈ క్రమంలో.. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కుమారస్వామితో పాటు జేడీఎస్ కీలక నేత.. మాజీ మంత్రి రేవన్న, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్లు నగరానికి చేరారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కుమారస్వామి బృందానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ స్వాగతం పలికారు. చీఫ్ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు. నగరంలోని తెలంగాణ భవన్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌లో జేడీఎస్ కుమారస్వామి సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. తమిళనాడుకు చెందిన విడుత్తలై చిరుత్తైగల్ కట్చీ (వీసీకే) అధినేత, ఎంపీ తిరుమావలవన్ కూడా నగరానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిలు ఆయనకు స్వాగతం పలికారు. Received Viduthalai Chiruthaigal Katchi Party President, Member of Parliament and Dalit leader from Tamilnadu Sri @thirumaofficial in Hyderabad today. pic.twitter.com/BSUHfdPhrz — Balka Suman (@balkasumantrs) October 4, 2022 -
పొలిటికల్ కారిడార్ : టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా మునుగోడుకే
-
‘ఫ్రీగా క్వార్టర్, కోడి.. కేటీఆర్‌గారూ మీ ఐడియానేనా?’
వైరల్: తెలంగాణ.. జాతీయ స్థాయి రాజకీయాలకు వేదిక కానుందనే చర్చ జోరందుకుంది. దసరా పండుగ నాడు టీఆర్ఎస్ తరపున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్నారనే జోష్‌లో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఈ తరుణంలో.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ నేత కోడి, క్వార్టర్ బాటిల్‌ను పంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఉంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజనాల శ్రీహరి అని తెలుస్తోంది. హమాలీలకు దగ్గరుండి మద్యం బాటిళ్లు, కోళ్లను పంపిణీ చేశారాయన. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్‌గా మారింది. దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా.. జాతీయ పార్టీ నేపథ్యంలో కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని, ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను ఆయన ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. Liquor party! Ahead of #KCR’s ‘national party’ #BRS launch, #TRS party leader Rajanala Srihari distributes liquor and chicken to locals, in Warangal, to celebrate the launch. The leader, reportedly, said he wants #KCR to become PM, his son #KTR to be CM of #Telangana. pic.twitter.com/J0gOYlsKVS — Rishika Sadam (@RishikaSadam) October 4, 2022 ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. కేసీఆర్ ని ప్రధాన మంత్రిని చేయడానికి టీఆర్ఎస్ నేతలు మద్యం, కోళ్లను పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ''ఇది మీ ఐడియానేనా కేటీఆర్ గారూ?'' అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారాయన. #WATCH | TRS leader Rajanala Srihari distributes liquor bottles and chicken to locals ahead of Telangana CM KC Rao launching a national party tomorrow, in Warangal pic.twitter.com/4tfUsPgfNU — ANI (@ANI) October 4, 2022 Wow!!! So now TRS leaders are distributing alcohol & chicken to make KCR Garu PM. Is it your idea @KTRTRS garu?😁 pic.twitter.com/EevSMjAcJs — Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 4, 2022 -
అనుమానం వద్దు.. భేటీ 5నే!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ఈ నెల 5న పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో యథావిధిగా జరుగుతుందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దసరా రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌కు చేరుకోవాలని ఆహ్వాని తుల జాబితాలోని వారికి సూచించారు. మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దసరా రోజు జరిగే టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంపై దాని ప్రభావం ఉండదని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశానికి ఆహ్వానాలు అందినవారు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిర్దేశిత సమయానికి రావాలని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణభవన్‌లో ఈ నెల 5న జరిగే ఈ భేటీకి రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా పరిషత్, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, టీఆర్ఎస్ 33 జిల్లాల అధ్యక్షులు హాజరుకావాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు. 5న మధ్యాహ్నం 2.30లోగా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ముగించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలంగాణభవన్ వర్గాలు వెల్లడించాయి. కొత్త జాతీయ పార్టీపై టీఆర్ఎస్లో ఉత్కంఠ కొత్త జాతీయపార్టీ ఏర్పాటుపై ఈ నెల 5న కీలక ప్రకటన చేసేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనుండటంతో కొత్తపార్టీ రూపురేఖలు, తీరుతెన్నులపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కొత్తపార్టీ పేరు, జెండా, ఎన్నికల చిహ్నం మొదలుకుని ఎజెండా తదితరాలపై ఆసక్తి కనిపిస్తోంది. అదే సమయంలో కొత్త జాతీయపార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కేసీఆర్ వేసే అడుగులు, ఎత్తుగడలు, పార్టీ భవిష్యత్తు తదితరాలపై పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ లాంఛనంగా ప్రకటన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న వివిధ పార్టీల నాయకులకు ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే అతిథుల జాబితాపై మంగళవారం ఉదయానికి స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఉప ఎన్నికతో సంబంధం లేదు.. తగ్గేదేలే అంటున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఎన్నికల హీట్ మొదలైంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక, గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం అఫిషీయల్‌గా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటీకీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే బరిలో నిలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. జాతీయ పార్టీ ప్రకటనపై సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్.. మునుగోడులో జాతీయ పార్టీతో బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీపై కసరత్తులో భాగంగా దసరా(అక్టోబర్ 5న) రోజున జరగాల్సిన సర్వసభ్య సమావేశం యథావిధిగాఘ జరుగుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికతో సమావేశానికి సంబంధం లేదన్నారు. కాగా, బుధవారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభంకానుంది. మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయి. కేంద్రం దుర్మార్గాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు అని కామెంట్స్ చేశారు. ఇక, ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 17గా ఉంది. 15న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. -
టీఆర్ఎస్సే బీఆర్ఎస్..!
విషయం: భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనున్న టీఆర్ఎస్ ముహూర్తం: దసరా రోజు మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు.. వేదిక: తెలంగాణ భవన్ ఆవిర్భావ సభ: డిసెంబర్ 9న ఢిల్లీలో.. (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) జెండా: గులాబీ రంగులోనే (చిహ్నం మార్పుతో) ఎజెండా: నీళ్లు, నియామకాలు, రైతులు, అభివృద్ధి (దసరా రోజు భేటీలో కేసీఆర్ స్పష్టత ఇస్తారు) సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందుతోంది. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 5న మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు తెలంగాణ భవన్ వేదికగా కొత్త జాతీయ పార్టీ పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రకటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక భేటీలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర మంత్రులతోపాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం వారితో సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో చాలా వరకు జాతీయ రాజకీయాలు, బీజేపీ పాలన తీరు, కాంగ్రెస్ పరిస్థితి, కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు వస్తున్న స్పందన తదితరాలపై మాట్లాడినట్టు తెలిసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఆహ్వానించినట్టు సమాచారం. దసరా రోజు విస్తృతస్థాయి సమావేశం కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 5న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పోరేషన్లు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లను ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, 33 జిల్లాల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులనూ కలుపుకొని మొత్తం 283 మంది ప్రతినిధులు విస్తృతస్థాయి భేటీలో పాల్గొననున్నారు. జిల్లాల వారీగా ఆహ్వానితులను సమన్వయం చేయాల్సిన బాధ్యతలను మంత్రులు, పార్టీ అధ్యక్షులకు అప్పగించారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా.. నిర్ణయించిన ముహూర్తానికి టీఆర్ఎస్ కొత్త జాతీయ పార్టీగా మారుతున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారు. సమావేశం ముగిశాక తెలంగాణ భవన్‌లోనే పార్టీ ప్రతినిధులతో కలిసి కేసీఆర్ భోజనం చేస్తారు. డిసెంబర్లో.. ఢిల్లీ వేదికగా.. ఈ ఏడాది డిసెంబర్ 9న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కొత్త జాతీయ పార్టీని కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ ఎత్తున ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి.. కొత్త జాతీయ పార్టీతో కలిసి వచ్చే నేతలు, జాతీయ స్థాయిలో భావ సారూప్య పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తారు. ఢిల్లీ బహిరంగ సభ డిసెంబర్ 9నే ఉంటుందా, లేక మరో తేదీన జరుగుతుందా అన్నదానిపై ఈ నెల 5న తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఉన్న గులాబీ రంగు జెండా, చిహ్నం స్వల్ప మార్పులతో కొత్త జాతీయ పార్టీ కొనసాగనుంది. కొత్తగా ఏర్పాటయ్యే జాతీయ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా దాదాపుగా ఖరారైనా.. ఈ నెల 5వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. కొత్త పార్టీ విధి విధానాలు, తదుపరి కార్యాచరణపై దసరా రోజు జరిగే సమావేశంలో కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు! ‘‘బీజేపీ దుర్మార్గాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇదే ప్రభుత్వం కొనసాగితే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. బీజేపీ అధికార దాహంతో ప్రజస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తోంది. కాంగ్రెస్ పార్టీ క్రమంగా జనాదరణ కోల్పోతోంది. మనం ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్కు అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోంది. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను, రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ వస్తోంది..’’ అని ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రస్తుతం రాజకీయంగా అత్యంత బలంగా ఉందని.. మునుగోడు ఉప ఎన్నికలో మంచి మెజారిటీతో గెలవబోతున్నామని స్పష్టం చేసినట్టు సమాచారం. దీనితోపాటు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నందునే బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందని కూడా పేర్కొన్నట్టు తెలిసింది. -
దసరాపై ఉత్కంఠ.. మునుగోడులో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ పార్టీ విషయంలో వేగంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్.. మంత్రులు, జిల్లాలో అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో తాజా రాజకీయాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఇక, ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంలో డిసెంబర్ 9వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, తెలంగాణభవన్‌లో దసరా రోజున టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. అదే రోజున జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్నారు. మరోవైపు.. జాతీయ స్థాయిలో వివిధ సంఘాల నేతలతో త్వరలో కేసీఆర్ భేటీ కానున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మునుగోడుపై కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీ పేరుతో మునుగోడు ఎన్నికల బరిలో ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈసారి మునుగోడు బరిలో మూడు జాతీయ పార్టీలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో అన్ని వర్గాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. మునుగోడులో అన్ని సర్వేలు టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.