సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బీఆర్‌ఎస్ జాతీయ విధానాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్‌తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జపాన్ కంపెనీ బోష్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు కేటీఆర్.ఇందుకోసం సీఎం కేసీఆర్ అనుమతి తీసుకున్నారు.
ఇదీ చదవండి: KCR BRS: మరో ప్రస్థానం
Comments
Please login to add a commentAdd a comment