Office Opening
-
ఐడీఎఫ్సీ రీజినల్ ఆఫీస్‌ను ప్రారంభించిన నందమూరి కల్యాణ్ రామ్ (ఫొటోలు)
-
మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఇంత గొప్ప పరిపాలన ఎప్పుడూ చూడలేదన్నారు. నేను 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ రాలేదంటూ పొగడ్తలు కురిపించారు. చంద్రబాబు, పవన్‌లు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఎవరెన్ని మాట్లాడినా ప్రజల అండతో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. చదవండి: (యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్) -
బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్‌తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జపాన్ కంపెనీ బోష్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు కేటీఆర్.ఇందుకోసం సీఎం కేసీఆర్ అనుమతి తీసుకున్నారు. ఇదీ చదవండి: KCR BRS: మరో ప్రస్థానం -
ఎస్సీ, ఎస్టీలకు అండగా ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్ 3వ అంతస్తులో శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసన మండలి ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, సమాచారహక్కు ప్రధాన కమిషనర్ రాజాసదారాం, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, కార్పొరేషన్ చైర్మ న్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కమిషన్ ఉందా అనే అనుమానం ఉండేదన్నారు. తెలంగాణ వస్తే వారికి పరిపాలించుకొనే స్తోమత ఉందా అని సమైక్యరాష్ట్ర పాలకులు ఎద్దేవా చేశారని, అన్ని అవరోధాల ను అధిగమించి అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కమిషన్ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, 2003లోనే కమిషన్ ఏర్పాటైనా ఎక్కడా పనిచేయలేదన్నారు. గతంలో సమైక్యపాలకులకు మాత్రమే కమిషన్‌లో అవకాశం ఇచ్చారని, తెలంగాణ దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందన్నారు. కమిషన్ ద్వారా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ముందుంటామన్నారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కమిషన్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఇది ప్రజా ఉద్యమాల వేదిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం పార్టీ కార్యక్రమాలకే కాకుండా ప్రజా ఉద్యమాలకూ వేదికగా ఉంటుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్ ఎత్తివేశాక వేదికలు లేకుండాపోయాయని, అయితే న్యాయపరమైన డిమాండ్లు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసే వారు వేదిక లేదని రంది పడాల్సిన అవసరం లేదని, టీజేఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులైనా మరెవరైనా దీనిని ఉపయోగించుకోవచ్చని, ప్రజా ఉద్యమాల సమాహారమే జన సమితి పార్టీ అని పేర్కొన్నారు. నాంపల్లి కేర్ ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ కొత్త కార్యాలయాన్ని గురువారం మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య ప్రారంభించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ఇప్పటికే అన్ని జిల్లాల కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ నెల 19, 20 తేదీల్లో పార్టీ రాజకీయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల వారికి 19వ తేదీన కరీంనగర్లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడెం తదితర జిల్లాల వారికి 20వ తేదీన వరంగల్‌లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఆ తర్వాత మిగతా జిల్లాల వారికి మహబూబ్‌నగర్‌లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సూచించారు. ఉద్యమ ఆకాంక్షల ధూంధాంకు మద్దతు ఇతర ప్రజా సంఘాలు జూన్ 1న తలపెట్టిన ఉద్యమ ఆకాంక్షల ధూం ధాంకు తమ మద్దతు ఉంటుందని కోదండరాం అన్నారు. రైతు సమస్యలపై 31వ తేదీన ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు తలపెట్టిన సడక్ బంద్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. రికార్డుల్లో దొర్లిన తప్పుల కారణంగా రూ.4 వేలు రావడం ఏమో కానీ చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారంలో టీజేఎస్ కార్యకర్తలు ముందుండాలని సూచించారు. సెల్‌ఫోన్ ద్వారా పార్టీలో చేరే కార్యక్రమం ముమ్మరం చేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా 500 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కొత్త ఒరవడికి టీజేఎస్ నాంది చుక్కా రామయ్య మాట్లాడుతూ తెలంగాణలో కొత్త ఒరవడికి టీజేఎస్ నాంది పలకాలన్నారు. అంబేడ్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కోదండరాం ముందుకు వస్తున్నారన్నారు. గతంలో తాము కన్న కలలను సాకారం చేయడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రస్తుత పరిస్థితులతో అమరవీరుల ఆత్మ ఘోషిస్తోందని, కాబట్టి టీజేఎస్ నేతలు చట్ట సభల్లో వారి తరపున మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర నాయకులు వెంకట్‌రెడ్డి, ధర్మార్జున్, విద్యాధర్‌రెడ్డి, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో.. పూల బిల్లే.. 3.34 లక్షలు!
చంద్రబాబు కార్యాలయం ఫ్లవర్ డెకరేషన్ ఖర్చు ఇది.. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ప్రారంభోత్సవం రోజున దాన్ని పూలతో అలంకరించడానికి ఖర్చు ఎంతయిందో తెలుసా? కొన్ని గంటల కోసం ఆ కార్యాలయాన్ని పూల మాలలతో అలంకరించడానికి అక్షరాలా 3.34 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్న ఎల్ బ్లాకులోని 8వ ఫ్లోర్లో సీఎం చంద్రబాబు కార్యాలయం ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పటికే రూ. 15 కోట్లు ఖర్చు చేసి సర్వ హంగులూ సమకూర్చారు. ఇక ఈ కార్యాలయంలో చంద్రబాబు అడుగుపెట్టే వేళ దాన్ని అలంకరించడానికి పూల కోసం 3,34,850 రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గత నెల 3న చంద్రబాబు అందులో అడుగు పెట్టారు. ఆరోజు పూల కోసం అయిన ఖర్చును ప్రోటోకాల్ విభాగం రూ. 3,34,850గా లెక్క తేల్చింది. వాటిని సమకూర్చిన హైదరాబాద్‌లోని ఫూల్ మహల్ నిర్వాహకులు ఈ మొత్తానికి బిల్లు సమర్పించారు. ఈ బిల్లు మంజూరు చేస్తూ శనివారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేకుండా ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు జీవోలో పేర్కొన్నారు.