సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌లో తమ పార్టీని విలీనం చేసేందుకు తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ ముందుకు వచ్చింది. బుధవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో విలీన ప్రకటన ఉండనుంది.
‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ పార్టీ నుంచి చిదంబరం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు తొల్కప్పియన్ తిరుమవలవన్ మంగళవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జేడీ(ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
మరో మూడు లైన్‌లో..!
తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ పార్టీ బీఆర్‌ఎస్‌లో విలీనానికి సిద్ధమైంది. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా బీఆర్‌ఎస్‌తో విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
చదవండి: (ప్రత్యామ్నాయ నాయకత్వం కోసమే...)
Comments
Please login to add a commentAdd a comment