General Body meeting
-
బిల్లులు ఇవ్వకుంటే పెట్రోల్ పోసుకుంటాం.. సర్పంచులు
-
కేసీఆర్ కొత్త పార్టీ.. జేడీఎస్ కుమారస్వామి రాక
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా టీఆర్ఎస్ నుంచి జాతీయ పార్టీ ఆవిర్భావ నేపథ్యంలో నగరంలో కోలాహలం నెలకొంది. కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరగబోయే పార్టీ జనరల్‌బాడీ మీటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే.. ఈ మీటింగ్ కోసం పలువురు ఇతర రాష్ట్రాల నేతలకు సైతం ఆహ్వానం వెళ్లింది. ఈ క్రమంలో.. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కుమారస్వామితో పాటు జేడీఎస్ కీలక నేత.. మాజీ మంత్రి రేవన్న, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్లు నగరానికి చేరారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కుమారస్వామి బృందానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ స్వాగతం పలికారు. చీఫ్ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు. నగరంలోని తెలంగాణ భవన్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌లో జేడీఎస్ కుమారస్వామి సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. తమిళనాడుకు చెందిన విడుత్తలై చిరుత్తైగల్ కట్చీ (వీసీకే) అధినేత, ఎంపీ తిరుమావలవన్ కూడా నగరానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిలు ఆయనకు స్వాగతం పలికారు. Received Viduthalai Chiruthaigal Katchi Party President, Member of Parliament and Dalit leader from Tamilnadu Sri @thirumaofficial in Hyderabad today. pic.twitter.com/BSUHfdPhrz — Balka Suman (@balkasumantrs) October 4, 2022 -
అన్నాడీఎంకేలో తారాస్థాయికి ముసలం.. జయ సమాధి వద్ద ఉద్రిక్తత
చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీకి ముందు పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS), మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం వర్గీయులు వాళ్ల వాళ్ల డిమాండ్లతో రచ్చకెక్కుతున్నారు. జూన్ 23న(గురువారం) జరగబోయే మీటింగ్‌లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నాడు. అదే సమయంలో.. తన సంతకం లేకుండా జనరల్ బాడీ ఆ తీర్మానం ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్ సెల్వం వాదిస్తున్నాడు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి తన పాయింట్‌ను వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులను ఆశ్రయించాడు ఆయన. అయితే.. ఈ భేటీ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో మాజీ మంత్రి బెంజిమన్ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు. నిర్వహణ ఉండాలా? వద్దా? అనేది పార్టీ జనరల్ కౌన్సిల్‌కు సంబంధించిన నిర్ణయమని, దానిని ఆపాలని ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు.. భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ తరుణంలో అన్నాడీఎంకే వర్గపోరు వేడి.. అక్కడి రాజకీయాలను హీటెక్కిస్తోంది. -
‘మా’ అధ్యక్షుడిగా నేనెందుకు అడ్డుపడతాను?
‘‘ఆదివారం జరిగిన ‘మా’ ఫ్రెండ్లీ అసోసియేషన్ మీటింగ్‌కి మీరు ఎందుకు రాలేదు? అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. దానికి అధ్యక్షుడిగా వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకుంది’’ అని ‘మా’ అధ్యక్షుడు నరేశ్ అన్నారు. ఇంకా నరేశ్ మాట్లాడుతూ– ‘‘25ఏళ్లలో ఎప్పుడూ ‘ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్’ జరగలేదు. 25 రోజుల కిందట నేను షూటింగ్లో ఉండగా ‘ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తున్నాం.. మీరు రావాలి’ అంటూ నాకు ఓ లెటర్ వచ్చింది. ‘మా’ అధ్యక్షుడిగా జనరల్ బాడీని ఆహ్వానించాల్సిన బాధ్యత నాకే ఉంది. కొత్త కమిటీ ఎంపికై 6 నెలలు కూడా కాకముందే ఈ జనరల్ బాడీ ఎందుకు జరుగుతోంది? అవసరం ఉందా? పైగా, నేను పిలవాల్సినదాన్ని ఎవరో పిలిచారు కాబట్టి దానికి నేను వెళ్లడం సబబు కాదని కొందరు పెద్దలు నాకు చెప్పారు. రెండు మూడు రోజుల తర్వాత ఇది ఫ్రెండ్లీ సమావేశమని చెప్పారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా నేను హాజరు కావాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి విడుదల కానున్న ఓ సినిమాలో 30మంది ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ కోసం ఆదివారం నేను డేట్స్ ఇచ్చాను కాబట్టి షూటింగ్లో ఉన్నా. జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోందని మళ్లీ ఓ సర్క్యులర్ వచ్చింది. ఈ సమావేశానికి నేను అడ్డుపడుతున్నానంటూ రాశారు. ‘మా’ కార్యక్రమాలకు అధ్యక్షుడిగా నేనెందుకు అడ్డుపడతాను? ఇది ఏ సమావేశమో తెలియకుండా నేను వెళితే అక్కడ జరిగే పరిణామాలకు నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది పనికిరాని ఓ సమావేశం అంటూ ఈసీ మెంబర్ పృథ్వీగారు కూడా పేర్కొన్నారు.. ఇందుకు ఆయన్ని నేను తప్పుబట్టడం లేదు. కొందరేమో ఇది ఫ్రెండ్లీ మీటింగ్ అంటున్నారు.. అక్కడి ‘మా’ ఫ్లెక్సీల్లోనేమో సర్వసభ్య సమావేశం అని ఉంది. ఫ్రెండ్లీ సమావేశంలో పాల్గొన్న ఓ న్యాయవాది ‘మా’ బైలాస్ మార్చాలి, పనికిరాని పాయింట్లు ఉన్నాయని చెప్పడం బాధగా అనిపించింది. పైగా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలంటే 20శాతం సభ్యులు ఆమోదించాలని ప్రింటెడ్ కాపీలతో వచ్చారంటే ఇది ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చించి పేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు వచ్చేందుకు కృషి చేస్తున్నాం. రూ.2 కోట్లతో ఓ కార్యక్రమం నిర్వహించనున్నాం. 30లక్షలు బ్యాంకులో ఉంది, మరో 1.70కోట్లు బ్యాంకుకు రానుంది.. వేడుకకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అందరూ ముందుకు రండి.. ‘మా’ సంస్థ భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం. ఇవి ఆగిపోయేలా ఎందుకు ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్.. మా ఫ్రెండ్లీ మీటింగ్‌గా ఎందుకు టర్న్ అయ్యిందో మాకు తెలియడం లేదు’’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు. -
సర్వం..ధ్వజం
వర్షాకాలం సమీపిస్తున్నా ఇంతవరకు నాలాల విస్తరణ జరగలేదు.. వర్షం వస్తే ఈసారీ ముంపు తప్పదు. ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీలు అన్ని ప్రాంతాల్లో వెలగడం లేదు.. పారిశుధ్య కార్యక్రమాలు అధ్వానంగా సాగుతున్నాయ్. రంజాన్ పనుల పేరిట నిధులు మంజూరైనా పనులు మాత్రం జరగలేదు. అధికారులు ఏం చేస్తున్నారంటూ సభ్యుల ప్రశ్నలతో బుధవారం జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం సాగింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగరంలోని పలు సమస్యలపై సభ్యులు ధ్వజమెత్తారు. వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు నెలలకో సారి జరిగే సమావేశంలో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని అంతా భావిస్తారు. కానీ గతంలో లేవనేత్తిన సమస్యలపైనే తిరిగి మళ్లీ ప్రస్తావించడం మామూలైంది. ప్రశ్నించేవారు.. సమస్యలు పరిష్కరించేవారు అక్కడే ఉన్నా గ్రేటర్ పాలనలో మాత్రం ఏమంత మార్పు కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన జీహెచ్ఎంసీ.. గ్రేటర్లో సంపూర్ణ ప్లాస్టిక్ వినియోగం నిషేధానికి సిద్ధమైంది. ఈమేరకు సర్వసభ్య సమావేశం ఆమోదించి, అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించడం చెప్పుకోదగ్గ అంశం. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశం మొక్కుబడి తంతుగా సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు సైతం ప్రజా సమస్యలపై ధ్వజమెత్తారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, పరిష్కార మార్గాలు మాత్రం చూపడం లేదంటూ అధికారులను నిలదీశారు. సభ ఎలా సాగిందంటే... ఎల్ఈడీ వీధి దీపాలు 98 శాతం వెలుగుతున్నాయని అధికారులు చెబుతున్నా అది వాస్తవం కాదని, ఇఫ్తార్ సమయంలోనూ చీకట్లతో అవస్థలు పడుతున్నామని, రోడ్లపై చెత్త ఎప్పటికప్పుడు తరలించడం లేదని, తగినన్ని డంపర్బిన్లు, డంపర్ ప్లేసర్లు లేక చెత్త సమస్యలు తీరడం లేవని, అధికారులను సంప్రదిస్తే అది తమ బాధ్యత కాదంటున్నారని ఎంఐఎం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ ఏర్పాట్లకు సంబంధించి ఇంకా 147 పనులు ప్రారంభం కాలేదని అధికారుల నివేదికలోనే ఉందని, వాటినెప్పుడు చేస్తారని ఎంఐఎం సభ్యులు సలీంబేగ్, ఫహద్‌బిన్ అబ్దుల్, ఎండి రషీద్ ప్రశ్నించారు. రంజాన్ పనులన్నీ రెండు రోజుల్లోగా పరిష్కారం కావాలని, ఆ తర్వాత తనకు ఒక్క ఫిర్యాదు కూడా రావద్దని మేయర్.. అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తున్నా నాలాల విస్తరణ పనులు పూర్తికాలేదని, టెండర్లు పిలిచినా పనులు మొదలు కాలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలాలపై కప్పులేక, పూడిక తిరిగి అందులోకే చేరుతోందని, తలాబ్‌కట్ట వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుతోందని సభ దృష్టికి తెచ్చారు. సఫ్దర్‌నగర్, పరికిచెరువు, ఫాక్స్‌సాగర్ తదితర ప్రాంతాల్లో పనులు జరగలేదన్నారు. లాలాపేటలో ఎనిమిదేళ్లుగా పూడిక తీసిందేలేదని టీఆర్ఎస్ సభ్యులు బంగారి ప్రకాశ్, శ్రీలత, ఎంఐఎం సభ్యులు అయేషా రూబినా, నస్రీన్ సుల్తానా, ఎండీ హుస్సేన్ తదితరులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఫాక్స్‌సాగర్‌కు సంబంధించి బహుళ అంతస్తుల భవనాలు, పట్టా భూములు ఉన్నందున.. కోర్టు కేసుల వల్ల ఆస్తుల సేకరణ జాప్యమవుతోందని సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. సఫ్దర్‌నగర్‌లో డిజైన్ మార్పుతో ఆలస్యమైందన్నారు. పూడికతీత గత సంవత్సరం ఇదే సమయానికి 32 శాతం జరగ్గా ఈ సంవత్సరం 35 శాతం జరిగిందని చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు. వివిధ మార్గాల నుంచి చార్మినార్‌కు దారితీసే రహదారుల పనులు పదేళ్లయినా పూర్తికాలేదని, ట్రాక్టర్లు లేక ఎత్తిన చెత్త రోడ్లపైనే ఉంటోందని పలువురు ఎలుగెత్తారు. అవార్డుల సంగతి అటుంచి, పారిశుధ్య పనుల్లో అవినీతిని అరికట్టాలని కోరారు. పారిశుధ్య పనులు నిర్వహించే ఎస్సార్పీలు ఏడాదిన్నరగా పనిచేయడం లేదని టీడీపీ సభ్యుడు మందడి శ్రీనివాసరావు సభ దృష్టికి తెచ్చారు. దోమల నివారణకు అదనపు డ్రైవ్‌లు చేపట్టి, అదనపు సామగ్రిని సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని మేయర్ అధికారులకు సూచించారు. చెరువులను శుభ్రపరిచాక ట్రీట్ చేసిన నీరు మాత్రమే చెరువులో చేరేలా కొత్త పాలసీ తెస్తున్నామన్నారు. వారు బదిలీ అయితే.. మీకెందుకు బాధ..? శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎస్ఎఫ్ఏ)బదిలీలపై పలువురు సభ్యులు ఆక్షేపించగా మేయర్ ఘాటుగానే సమాధానమిచ్చారు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియాల బుకింగ్‌కు ఆన్లైన్ అందుబాటులోకి తేవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా, కమిషనర్, మేయర్ వారికి తగిన సమాధానమిచ్చారు. ఎస్ఎఫ్ఏల బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని, రంజాన్ అనంతరం బదిలీ చేయాలని కోరగా, రంజాన్ తర్వాత బోనాలు, వినాయక చవితి ఉంటాయని.. ప్రత్యేక సందర్భంలేని సమయముంటుందా? అంటూ మేయర్ అన్నారు. బయోమెట్రిక్ హాజరుతోనే ఎన్నో నిధులు ఆదా అయ్యాయని, ఎస్ఎఫ్ఏలను బదిలీ చేస్తే మీకు బాధేంటని ప్రశ్నించారు. బదిలీ అయిన వారు వెంటనే విధుల్లో చేరేలా డిప్యూటీ కమిషనర్లు బాధ్యత వహించాలని జగదీశ్వర్ సూచించారు. స్పోర్ట్స్ స్టేడియాల్లో స్థానికులకు సదుపాయం, కాలనీల్లోని స్టేడియాల్లో ఇరుగుపొరుగువారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సభ్యులు శేషుకుమారి, స్వర్ణలతారెడ్డి కోరారు. క్రికెట్ కిట్ల పంపిణీల్లో అవకతవకలు జరుగుతున్నాయని విజిలెన్స్ నివేదిక ఉన్నందున జీహెచ్ఎంసీ క్యాంపుల్లోనే వీటిని పంపిణీ చేస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. అందరి కృషితోనే అవార్డులు: కమిషనర్ జనార్దన్‌రెడ్డి జీహెచ్ఎంసీకి సంవత్సర కాలంలో 13 అవార్డులు రావడం వెనుక అందరి సమష్టి కృషి ఉందని కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. దీంతో సభలోని అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలో 96 శాతం ఎల్ఈడీ వీధిదీపాలు వెలుగుతున్నాయని, అయితే 98 శాతానికి పైగా వీధిదీపాలు వెలిగితేనే ఈఈఎస్ఎల్ సంస్థకు చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం! ఇప్పటికే 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన జీహెచ్ఎంసీ.. గ్రేటర్లో ప్లాస్టిక్ వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించాలని నిర్ణయించింది. సర్వసభ్య సమావేశంలో ఈమేరకు ఆమోదం తెలుపుతూ, అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉందన్నారు. జీహెచ్ఎంసీలో రోజుకు దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, అందులో 400– 500 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలేనన్నారు. తాత్కాలిక అవసరాల నిమిత్తం ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను నిత్యజీవితంలో ఉపయోగిస్తున్నప్పటికీ ఇవి దీర్ఘకాలికంగా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపించి ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని మేయర్ అన్నారు. ముఖ్యంగా వర్షాలకు నాలాలు, సివరేజీ లైన్లు ప్లాస్టిక్ వ్యర్థాలతో పేరుకుపోయి నీరు పారే దారిలేక రోడ్లు మునుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో 1986 పర్యావరణ పరిరక్షణ చట్టానికి లోబడి 50 మైక్రాన్ల కన్నా అధికంగా ఉండే అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల తయారీ, సరఫరా, అమ్మకాలపై నిషేధం విధించాలని నిర్ణయించామన్నారు. ఈ అంశం స్టాండింగ్ కమిటీలో చర్చించాక ఆమోదించవచ్చని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అభ్యంతరం వ్యక్తం చేయబోగా, ప్రభుత్వ ఆమోదానికి ఎంతో సమయం పడుతుందని, అసెంబ్లీ ఆమోదం కూడా పొందాల్సి ఉంటుందని మేయర్ బదులిచ్చారు. -
అంతా అధికారులే చేశారు!
పంట నష్టం పరిహారం పంపిణీలో అక్రమాలపై అధికార పార్టీ సభ్యులు వ్యవసాయశాఖ సిబ్బందిపై చర్యలకు డిమాండ్ పింఛన్, తాగు, సాగునీటి కష్టాలకూ అధికారులపై నెపం అనంత జెడ్పీ సమావేశంలో వాడీవేడి చర్చ ఇంత కాలం అధికారులపై పెత్తనం చెలాయిస్తూ.. సంక్షేమ పథకాల ఫలాలన్నీ పక్కదారి పట్టించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తాజాగా మాటమార్చారు. పంట నష్టం పరిహారం పంపిణీలోను. పింఛన్లు, తాగు, సాగునీటి కష్టాలకు అధికారుల తప్పిదాలే కారణమంటూ నెపం నెట్టేశారు. అన్నింటికీ అధికారులనూ బాధ్యలను చేస్తూ మాటలన్నారు... చిందులు తొక్కారు. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా బిక్కచచ్చిపోయారు. గురువారం జరిగిన జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం.. అధికారులకు ఓ గుణపాఠంగా నిలిచింది. - అనంతపురం సిటీ రైతు సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని అధికారులే మంట గలుపుతున్నారంటూ టీడీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ చమన్ అధ్యక్షతన గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. అర్హులైన చాలామంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చేరలేదన్నారు. ఇందుకు కారకులైన వ్యవసాయ శాఖ సిబ్బందిపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖ జేడీ రామ్మూర్తి ఉదాసీన వైఖరితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో చోటు చేసుకున్న అక్రమాలపై కూడా అధికారులనే బలిపశువులను చేశారు. అర్హులకు పింఛన్లు అందకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆరోపించారు. మూడేళ్ల తర్వాత అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలు గుర్తుకు వస్తున్నాయని, ఇంతకాలం అధికారులపై ఒత్తిళ్లు పెంచి అక్రమ మార్గాల్లో పనులు చేయించుకున్నవారే నేడు సమావేశంలో అధికారులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రవీంద్రారెడ్డి ప్రశ్నలతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇరుకునపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.కోట్లు కాజేశారని, వారితో పోల్చుకుంటే తామే మేలంటూ ఎమ్మెల్యే పార్థసారథి చెప్పొకొచ్చారు. అదే సమయంలో రవీంద్రారెడ్డి మాట్లాడబోతుండగా మైక్ కట్ చేయించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తినరసింహారెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ...మహానేత వైఎస్సార్ పుణ్యమా అంటూ జిల్లాకు హంద్రీ-నీవా వరంగా మారిందని అన్నారు. వైఎస్సార్ చేసిన పనిని తమ గొప్పగా టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. దీంతో సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోగుల జేబులు లూటీ చేస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టాలని సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూతపడకుండా చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్ వీరపాండియన్ స్పష్టం చేశారు. అనంతరం వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపులకు ఆగస్టు 31 వరకు గడువు పొడగించాలని, జెడ్పీలోని పాతభవనాన్ని తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని సభ్యులు తీర్మానించారు. సమావేశంలో మంత్రి పరిటాల సునీత, సీఈఓ రామచంద్ర, ఉపాధ్యక్షురాలు సుభాషినమ్మ, తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పింఛన్లు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులపై సుదీర్గ చర్చలు జరిగాయి. -
అధ్యక్షా.. సర్వం సమస్యలే !
- నేడు జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం - మూడేళ్ల పాలనలో రైతులకు ముప్పుతిప్పలు - సమస్యలపై గళం విప్పనున్న వైఎస్సార్సీపీ సభ్యులు - చైర్మన్ చమన్ సారథ్యంలో చివరి సమావేశం అనంతపురం సిటీ : జిల్లాలో ఎటుచూసినా సమస్యలు పేరుకుపోయాయి. పరిష్కారం చూపాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదు. మూడు నెలలకోసారి జరిగే జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ప్రజాభివృద్ధికి, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన పాలకులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి సారీ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగుతోంది. ఈనెల 13న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ప్రజాభివృద్ధికి పైసా విదిల్చకుండా మూడేళ్ల పాలన అంతా కాలం గడుపుతూ వచ్చిన పాలకవర్గాన్ని నిలదీసేందుకు, ప్రజాసమస్యలే అజెండాగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు సిద్ధమయ్యారు. జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. వందలాది అడుగులలోతు బోరు వేసినా నీటి చెమ్మ కనిపించడం లేదు. నీరులేక పండ్లతోటలు ఎండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సిన వేరుశనగ .. కనీసం వేలాది హెక్టార్లు కూడా సాగు చేయని పరిస్థితి. 24 మండలాల్లో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని ప్రభుత్వానికి అధికారులు కూడా నివేదికలు పంపారు. గ్రామాల్లో తాగునీటికి కష్టాలు పడుతున్నారు. అరకొర దొరికే నీటిలోనూ ఫ్లోరైడ్ అధిక శాతం ఉండడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఆస్పత్రుల్లో వాంతులు, విరేచనాలు, విష జ్వరాలతో జనం అవస్థలు పడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా పాఠ్యపుస్తకాల కొరత తీర్చడం లేదు. తడారుతున్న పల్లె గొంతులు : జిల్లాలోని 1003 గ్రామ పంచాయతీల్లో సగానికి పైగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాయి. వర్షాలు కురవక పోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. ప్రత్యామ్నాయ చర్యల పేరుతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ఏ మూలకూ సరిపోవడంలేదని పల్లెల్లో రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. జిల్లాలో 24 మండలాల్లో తాగు నీటి కష్టాలున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ ప్రాంతాలకు మరిన్ని ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయిస్తామని చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. గండి కోట రిజర్వాయర్ నుంచి తాగునీటి అవసరాలు తీర్చుకోవాల్సి ఉన్నా ..జేసీ నాగిరెడ్డి పథకం పనులు పూర్తి చేయక పోవడంతో 514 గ్రామాలకు చేరాల్సిన నీరు 14 గ్రామాలకే పరిమితమైంది. ఈ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు అడుగడుగునా అడ్డు తగులుతుండటంతో పనులు ముందుకు సాగలేదు.ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు లెక్కలు చూపి నిధులు కాజేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కూడేరు వద్దనున్న పీఏబీఆర్ తాగునీటి పథకం నుంచి నీటి సరఫరాకు అవకాశం ఉన్నా ..నీరు ఇవ్వకుండా అధికార పార్టీనేతలు అడ్డు తగులుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. చమన్ సారధ్యంలో చివరి సమావేశం : మూడేళ్ల ఒప్పందానికి తెరపడింది. జిల్లా పరిషత్ చైర్మన్‌గా తన బాధ్యతల నుంచి చమన్ తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన సారధ్యంలో ఈ నెల 13న జరిగే సాధారణ సర్వసభ్య సమావేశంగా ఇది మిగిలి పోనుంది. -
నిబంధనల మేరకే..
► అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక ► సర్వసభ్య సమావేశంలో ఎంపిక ► ఫిర్యాదు చేసిన వారే ప్రతిపాదించారు ► సీఈసీకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ సాక్షి ప్రతినిధి, చెన్నై: నిబంధనల మేరకే తన నియామకం జరిగిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి తెలిపారు. పార్టీ సంప్రదాయం ప్రకారం సర్వసభ్య సమావేశం ద్వారా ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకున్నారని సీఈసీకి సమర్పించిన వివరణలో ఆమె పేర్కొన్నారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆమె స్థానంలో ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. ఆ తరువాత నెలకొన్న విభేదాల వల్ల మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ తదితరులపై ఆమె బహిష్కరణ వేటు వేశారు. నిరంతరాయంగా ఐదేళ్లపాటు సభ్యత్వంలేని శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన 12 మంది పార్లమెంటు సభ్యులు సీఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలి్సందిగా వారు కోరారు. ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుపై బదులివ్వాల్సిందిగా శశికళను సీఈసీ కోరింది. శశికళ తరఫున పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఇటీవలే సీఈసీకి వివరణ ఇచ్చారు. అయితే శశికళ ఇచ్చిన నోటీసుపై దినకరన్ బదులివ్వడం ఏమిటని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసును అందుకున్న శశికళనే ఈనెల 10వ తేదీలోగా బదులివ్వాలని ఇటీవల ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు 70 పేజీలతో కూడిన ఉత్తరం ద్వారా శుక్రవారం బెంగళూరు జైలు నుంచే సీఈసీకి శశికళ బదులిచ్చారు. గతంలో దినకరన్ ఇచ్చిన వివరాలనే శశికళ తరఫు న్యాయవాది సీఈసీకి సమర్పించారు. ప్రధాన కార్యదర్శిని పార్టీ సర్వసభ్య సమావేశం ద్వారానే ఎన్నుకుంటారని, తన నియామకం కూడా అదే రీతిన జరిగింది. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తులే పార్టీ సర్వ సభ్యసమావేశంలో తన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా కలిసి ఎకగ్రీవంగా తనను ఎన్నుకున్నారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడే ఎన్నిక జరిగిందని శశికళ వివరణ ఇచ్చారు. -
డీఎంకే సర్వసభ్య సమావేశానికి సిద్ధం
► నేడు అరివాలయంకు కరుణ ► స్టాలిన్ నిర్వాహక అధ్యక్షుడయ్యేనా? సాక్షి, చెన్నై : పార్టీ సర్వ సభ్య సమావేశానికి డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాలయంలో సర్వం సిద్ధమైంది. రెండున్నర నెలల అనంతరం డీఎంకే అధినేత ఎం.కరుణానిధి బుధవారం అరివాలయంలో అడుగు పెట్టనున్నారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కు నిర్వాహక అధ్యక్షుడి పగ్గాలు అప్పగించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో మద్దతు, వ్యతిరేక గళం బయలు దేరింది. అదే సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆసుపత్రిలో చేరడం ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేపింది. ఆసుపత్రి నుంచి కరుణానిధి సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా బయటకు రావడంతో ఆనందం వికసింది.ఇక, డీఎంకే సర్వ సభ్య సమావేశాన్ని గత నెల 20వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయించినా, కరుణ ఆసుపత్రిలో ఉండడంతో వాయిదా వేసుకున్నారు. చివరకు బుధవారం సమావేశానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. తేనాం పేటలోని అన్నా అరివాలయం వేదికగా ఉదయం పది గంటలకు జరగనున్న సర్వ సభ్యం భేటికి సర్వం సిద్ధమైంది. రెండున్నర నెలల అనంతరం కరుణానిధి అరివాలయంలో అడుగు పెట్టనున్నడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు జరిగాయి. ఇక, సర్వ సభ్య సమావేశం వేదికగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ కు ప్రమోషన్ కల్పించే రీతిలో నిర్ణయాలు తీసుకోవచ్చన్న ప్రచారం సాగుతోంది. కరుణానిధి వయోభారంతో ఉన్న దృష్ట్యా, ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడంతో పాటు, తన ప్రతినిధిగా, రాజకీయ వారసుడు స్టాలిన్ ను నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కరుణానిధి అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి అన్భళగన్ నేతృత్వంలో సాగనున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సర్వ సభ్య సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇప్పటికే చెన్నైకు చేరుకున్నారు. -
రసాభాసగా జెడ్పీ సమావేశం
-
ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా
జిల్లా ఏర్పాటుపై సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానం రియల్ వ్యాపారుల ఆక్రమాలకు చెక్ పెడతాం శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలం మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ మెదక్ మున్సిపాలిటీ: ప్రజల ఆకాంక్ష మేరకు మెదక్ జిల్లాను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్గౌడ్తోపాటు సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ ఆ«ధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెదక్ పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన జిల్లాను రాజకీయ కోణాల్లో కాకుండా భౌగోళికంగా, శాస్త్రీయ పరంగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని కౌన్సిల్ సభ్యులు కోరారు. దీంతో సభ్యులంతా ఆమోదం పలికారు. అనంతరం చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ బల్దియాలో ఆస్తిపన్నులు, నల్లా బకాయిలు కుప్పలు, తెప్పలుగా పేరుకు పోయాయని, అధికారులు బకాయిలు వసూలు చేసి పట్టణాభివృద్ధికి తోడ్పాడాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద పట్టణానికి ఎల్ఈడీలైట్లు మంజూరయ్యాయని, వాటిని మొదటి దశలో నర్స్‌ఖేడ్, ఫతేనగర్ వీధుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కౌన్సిలర్ రాధ మాట్లాడుతూ పట్టణంలో కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా ఉందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన చైర్మన్ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌన్సిలర్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ పట్టణంలో రియల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తూ చెలరేగిపోతూ అడ్డగోలుగా రేట్లకు భూములను విక్రయిస్తున్నారని ఆరోపించారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, తగు చర్యలు తీసుకుంటామని, అలాంటివి తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్‌చైర్మన్ తెలిపారు. పట్టణంలో శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని, ప్రస్తుత వర్షాకాల సీజన్లో వ్యాధులు ప్రబలుతున్నాయని కౌన్సిలర్ రబ్బీన్ దీవాకర్ సమావేశంలో మండిపడ్డారు. 14వ వార్డులో మట్టి కుప్పలను, పిచ్చి మొక్కలను తొలగించాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్పందించిన చైర్మన్ 14వార్డులో నెలకొన్న పిచ్చి మొక్కలను, మట్టికుప్పలను తొలగించాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ కౌన్సిలర్లకు అధికారులు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్‌చైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శాంతి, భద్రతలు లోపిస్తున్నాయి పట్టణంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపిస్తున్నాయని కౌన్సిలర్ బట్టి సులోచన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు వారి వ్యక్తిగత పోకడల కోసం యువకులను రెచ్చగోడుతూ దాడులు చేయిస్తున్నారన్నారు. వీరికి పోలీసులు సైతం మద్దతు పలుకుతున్నారన్నారు. గతంలో తన కుమారుడిపై కూడా హత్యాయత్నం జరిగిందని ఆమె గుర్తు చేశారు. శాంతి భద్రతల విషయంలో తగు చర్యలు చేపట్టకుంటే తానే నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంపై చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ పట్టణంలోని శాంతిభద్రతల విషయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపడుతామని తెలిపారు. సమావేశంలో వైస్‌చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు ఆర్కెశ్రీనివాస్, చంద్రకళ, లక్ష్మి, గాయత్రి, కో అప్షన్ సబ్యులు గంగాధర్, కమిషనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
లాభాల బాటలో డీసీసీబీ
రుణాల మంజూరు, రికవరీలో మొదటి స్థానం దివంగత సీఎం వైఎస్ చలువతోనే సహకార బ్యాంకులకు జీవం డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి వరంగల్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) వాణిజ్య బ్యాంకులకు ధీటుగా వ్యాపారం చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. డీసీసీబీ కార్యాలయ ఆవరణలో ఆదివారం బ్యాంకు మహాజన సభ(జనరల్ బాడీ) సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015–16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ద్వారా రూ.435 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లక్ష్యానికి మించి గత ఆర్థిక సంవత్సరంలో రైతులు, ఇతర వర్గాలకు రూ.501 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. రుణాల రికవరీలోనూ 98.8 శాతం వృద్ధి సాధించామన్నారు. రూ.235 కోట్ల డిపాజిట్లు సేకరించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వరంగల్ డీసీసీబీ నిలిచిందన్నారు. సుమారు రూ.2 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయపు పన్నుగా చె ల్లించామన్నారు. సహకార రంగంలోని బ్యాం కులు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీతోనే బతికి బట్ట కట్టాయన్నారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో సహకార రంగంలోని బ్యాంకులు జీవం పోసుకున్నాయన్నారు. అనంతరం నాబార్డ్ డీడీఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడంతో పాటు అదే విధంగా చెల్లింపులు ఉంటే రుణాల టార్గెట్ పెంచే అవకాశాలు ఉన్నాయన్నారు. జీఎం సురేందర్ సేవలతోనే బ్యాంకు అభివృద్ధి డీసీసీబీలో 1986లో సాధారణ ఉద్యోగిగా చేరిన వి.సురేందర్ నేడు జీఎం స్థాయి వరకు చేసిన సేవల వల్లే బ్యాంకు అభివృద్ధి బాటలో పయనించిందని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. జీఎం సురేందర్ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. రాఘవరెడ్డి మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగిన జీఎం సురేందర్ బ్యాంకును లాభాల బాట పట్టించారన్నారు. అనంతరం సురేందర్ దంపతులను జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. బ్యాంక్ వైస్ చైర్మన్ రాపోలు పుల్లయ్య, డైరెక్టర్లు బిల్లా సుధీర్‌రెడ్డి, పోతరాజు శ్రీనివాసు, ఎ.జగన్మోçßæన్‌రావు, కేడల జనార్ధన్, డీసీఓ చక్రధర్, సీఈఓ యాదగిరి, జీఎం సురేందర్, డీజీఎం శ్రీనివాస్, పీఏసీఎస్‌ల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు. -
ఎవరికీ పట్టని సర్వసభ్య సమావేశం
మిరుదొడ్డి: ప్రజాప్రతినిధుల్లో సమయ పాలన కొరవడింది. వీరికి అధికారులు తోడయ్యారు. వెరసి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని గంటన్నరలోపే ముగించేశారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్యసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీపీ పంజాల కవిత నిర్ణీత సమయానికి వచ్చినప్పటికీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు ఎవరూ లేక సమావేశం ప్రారంభం కాలేదు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి ఎవరూ రాక పోవడంతో ఎంపీపీ కవిత ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా అభ్యర్థించడం కనిపించింది. 12 గంటలకు ప్రారంభమైన సమావేశానికి ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు రావడంతోనే సరిపోయింది. మండల పరిధిలో 11 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఆరుగురు, 16 సర్పంచ్‌లకు గాను ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. వీరికి తోడు వివిధ శాఖల అధికారులు చాలా మట్టుకు డుమ్మాలు కొట్టారు. దీంతో ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడంతో అధికారుల తీరును ప్రశ్నించే నాథులు కరువయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పశువుల దవాఖాన కొత్త భవన నిర్మాణంపై అధికారులు సహకరించడం లేదని, మిషన్ భగీరథ పనుల్లో తీసిన కాలువలు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కాలువలతో జనాలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని మిరుదొడ్డి సర్పంచ్ మద్దెల రోషయ్య సమస్యను లేవనెత్తారు. సెరికల్చర్ అధికారులు పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కలిగించకుండా ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని లక్ష్మీనగర్ సర్పంచ్ చిప్ప శివకుమార్ లేవనెత్తడం మినహాయిస్తే సర్వసభ్య సమావేశం అంతా తూతూ మంత్రంగానే సాగింది. ప్రజా సమస్యలపై ఇంత నిర్లక్ష్యం తగదు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించడం తగదని ఎంపీపీ పంజాల కవిత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు సమయపాలన పాటించకపోవడం దారుణమన్నారు. ఒక దశలో ప్రజాప్రతినిధులు సమావేశానికి రావాల్సిందిగా తానే ఫోన్ చేసి అభ్యర్థించాల్సి వచ్చిందని, ఇది విచారకరమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమయ పాలన విధిగా పాటించాలని ఘాటుగా హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంట బాపురెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ నీలకంఠ మఠం నగేష్, ఇన్చార్జి తహసీల్దార్ ఉమారాణి, ఎంఈఓ జోగు ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. -
పురుషాధిపత్యం...
డీ.హీరేహాళ్ :మహిళల రాజకీయ ఎదుగుదలకు భర్తలే అడ్డుగా నిలుస్తున్నారనేందుకు అద్దం పట్టింది బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాస్తూ ఎంపీపీ భర్త వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే... ఎంపీపీ పుష్పావతికి మండల సమస్యలపై మంచి అవగాహన ఉంది. రాజకీయంగానూ ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. అయితే ఆమెను అసహాయురాలిగా చేస్తూ బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె భర్త మహాబలి అధ్యక్షురాలి సీటు పక్కనే తాను ప్రత్యేకంగా ఆసీనుడయ్యాడు. ప్రజాప్రతినిధులు సంధించిన ప్రతి ప్రశ్నకూ తానే ఎంపీపీ అనే రీతితో సమాధానమిస్తూ అధికారులను సైతం డమ్మీలుగా మార్చేశాడు. భర్త ఆగడాన్ని ఎమ్పీపీ మౌనంగా భరిస్తూ వచ్చారు. -
జెడ్పీ వార్షిక బడ్జెట్ రూ.260కోట్లు
కర్నూలు(జిల్లా పరిషత్ ): కర్నూలు జిల్లా ప్రజాపరిషత్ 2015-16 సంవత్సరానికి గాను రూ.260కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌ను శనివారం స్థాయీ సంఘాల కమిటీల ముందు ప్రవేశపెట్టారు. కమిటీలు ఈ బడ్జెట్‌ను ఆమోదించి, ఈ నెల 27వ తేదీన జరిగే జెడ్పీ జనరల్ బాడీ సమావేశం ముందుంచేందుకు తీర్మానించాయి. జనరల్ బాడీ ఆమోదించిన తర్వాత దానిని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఈ బడ్జెట్‌ను వచ్చే యేడాది ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 199ని అనుసరించి, ప్రభుత్వ ఉత్తర్వుల నెం.172 పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి నిబంధనల మేరకు జిల్లా పరిషత్ 2014-15 సంవత్సరపు సవరణ బడ్జెట్, 2015-16వ సంవత్సరపు బడ్జెట్ అంచనాలను అధికారులు తయారు చేశారు. జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాల ఆవశ్యకత, గత సంవత్సరపు జిల్లా పరిషత్ వార్షిక లెక్కల్లో ఆదాయ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించారు. 2013-14, 2014-15నకు సంబంధించి ఆదాయ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని 2014-15 సవరణ బడ్జెట్, 2015-16 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను శనివారం జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో ఏవో భాస్కరనాయుడు ప్రవేశపెట్టారు. అధికారుల లెక్కల ప్రకారం 2013-14లో ఆదాయం రూ.127.08 కోట్లు, వ్యయం రూ.117.31కోట్లు, 2014-15 సంవత్సరంలో రూ.276.62కోట్లు, వ్యయం రూ.276.50 కోట్లు, సవరించిన బడ్జెట్ 2014-15లో ఆదాయం రూ.196.47కోట్లు, వ్యయం రూ.196.46కోట్లు, 2015-16 సంవత్సరానికి అంచనా బడ్జెట్ రూ.260.01కోట్లు, వ్యయం రూ.259.72 కోట్లుగా అధికారులు చూపించారు. అవి మొక్కుబడి సమావేశాలు -అధికారుల ప్రగతి నివేదికలతో సరి కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లా ప్రజా పరిషత్ జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు మొక్కుబడిగా సాగాయి. ఏడు కమిటీల్లోనూ సభ్యులు నామమాత్రంగా హాజరయ్యారు. దీంతో అధికారుల ప్రగతి నివేదికలతో సమావేశాలను మమ అనిపించారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన స్థాయీ సంఘ సమావేశాలు గంట ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మొదట 5వ స్థాయీ సంఘమైన స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో ప్రారంభించగా అంగన్వాడీ కేంద్రాలను సభ్యులు తరచూ తనిఖీ చేయాలని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ సూచించారు. ఎన్సీఎల్పీ పీడీ సమావేశానికి హాజరుకాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 6వ స్థాయీ సంఘమైన సాంఘిక సంక్షేమం, 3వ స్థాయీ సంఘమైన వ్యవసాయ శాఖ సమావేశంలో అధికారులు ప్రగతిని నివేదించారు. ప్రతి మండలంలో 3 గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రైనేజి నిర్మాణాలకు రూ.250కోట్లు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ ఎస్ఈ సురేంద్రబాబు చెప్పారు. ఆదర్శగ్రామంగా ఎన్నికైన నాగులదిన్నెను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.