లాభాల బాటలో డీసీసీబీ
-
రుణాల మంజూరు, రికవరీలో మొదటి స్థానం
-
దివంగత సీఎం వైఎస్ చలువతోనే సహకార బ్యాంకులకు జీవం
-
డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి
వరంగల్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) వాణిజ్య బ్యాంకులకు ధీటుగా వ్యాపారం చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. డీసీసీబీ కార్యాలయ ఆవరణలో ఆదివారం బ్యాంకు మహాజన సభ(జనరల్ బాడీ) సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015–16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ద్వారా రూ.435 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లక్ష్యానికి మించి గత ఆర్థిక సంవత్సరంలో రైతులు, ఇతర వర్గాలకు రూ.501 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. రుణాల రికవరీలోనూ 98.8 శాతం వృద్ధి సాధించామన్నారు. రూ.235 కోట్ల డిపాజిట్లు సేకరించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వరంగల్ డీసీసీబీ నిలిచిందన్నారు. సుమారు రూ.2 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయపు పన్నుగా చె ల్లించామన్నారు. సహకార రంగంలోని బ్యాం కులు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీతోనే బతికి బట్ట కట్టాయన్నారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో సహకార రంగంలోని బ్యాంకులు జీవం పోసుకున్నాయన్నారు. అనంతరం నాబార్డ్ డీడీఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడంతో పాటు అదే విధంగా చెల్లింపులు ఉంటే రుణాల టార్గెట్ పెంచే అవకాశాలు ఉన్నాయన్నారు.
జీఎం సురేందర్ సేవలతోనే బ్యాంకు అభివృద్ధి
డీసీసీబీలో 1986లో సాధారణ ఉద్యోగిగా చేరిన వి.సురేందర్ నేడు జీఎం స్థాయి వరకు చేసిన సేవల వల్లే బ్యాంకు అభివృద్ధి బాటలో పయనించిందని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. జీఎం సురేందర్ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. రాఘవరెడ్డి మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగిన జీఎం సురేందర్ బ్యాంకును లాభాల బాట పట్టించారన్నారు. అనంతరం సురేందర్ దంపతులను జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. బ్యాంక్ వైస్ చైర్మన్ రాపోలు పుల్లయ్య, డైరెక్టర్లు బిల్లా సుధీర్‌రెడ్డి, పోతరాజు శ్రీనివాసు, ఎ.జగన్మోçßæన్‌రావు, కేడల జనార్ధన్, డీసీఓ చక్రధర్, సీఈఓ యాదగిరి, జీఎం సురేందర్, డీజీఎం శ్రీనివాస్, పీఏసీఎస్‌ల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు.