
కళాకారులతో కలిసి కోలాటం ఆడుతున్న ఖుష్బూ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయ మని సినీనటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ధీమా వ్యక్తంచేశారు. ఆవో దేఖో, సీఖో అంటూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పకొట్టారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో ఖుష్బూ మాట్లాడుతూ బీజేపీని చూసి సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు పెట్టారని, అవన్నీ టీఆర్‌ఎస్ భయాన్ని తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఖుష్బూ కళాకారులతో కలిసి కోలాటం ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment