ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. మను బాకర్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు | Ys Jagan Congratulates Manubakar For Winning Bronze Medal In Paris Olympics | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. మను బాకర్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Published Sun, Jul 28 2024 7:13 PM | Last Updated on Sun, Jul 28 2024 7:20 PM

Ys Jagan Congratulates Manubakar For Winning Bronze Medal In Paris Olympics

సాక్షి, గుంటూరు: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మను బాకర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. యావత్‌ భారతదేశాన్ని గర్వపడేలా చేశారు’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనుబాకర్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో మనూ 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలువగా.. సౌత్‌ కొరియాకు చెందిన ఓ (243.2), కిమ్‌ (241.3) మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్‌ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా మనూ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల మనూ హర్యానాకు చెందిన యువతి. మనూ తండ్రి మెరైన్‌ ఇంజనీర్‌ కాగా.. తల్లి ప్రిన్సిపల్‌. మనూ.. 2018 కామన్‌వెల్త్‌ క్రీడల్లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పతకం సాధించింది. మనూ అర్జున అవార్డు గ్రహీత.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement