France's Emmanuel Macron Wins Second Term As French President - Sakshi
Sakshi News home page

France Election: ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌

Published Mon, Apr 25 2022 8:14 AM | Last Updated on Mon, Apr 25 2022 9:13 AM

Emmanuel Macron Wins Second Term As French President - Sakshi

France election.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్‌ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి మరీన్‌ లీపెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో, అధికారిక ఫలితాలు వెలువడక ముందే లీపెన్‌ తన ఓటమిని అంగీకరించారు. ఈ క్రమంలో మాక్రాన్‌ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్‌, యూరోపియన్ జెండాలను ఊపారు. 

కాగా, ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్‌ లీపెన్‌పై గెలిచి 39 ఏళ్ల మాక్రాన్‌ ఫ్రాన్స్‌ లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. ఇక, గడిచిన 20 ఏళ్లలో వరుసగా రెండు సార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్‌ రికార్డు సృష్టించారు. ఇక, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మాక్రాన్‌ రెండోసారి ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్‌లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చినట్టు అయిందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 

మాక్రాన్‌ మరోసారి విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు అందుతున్నాయి. మాక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. "ఫ్రాన్స్ మా అత్యంత సన్నిహిత, ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటి. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్‌ మళ్లీ ఎన్నికైనందుకు అభినందనలు" అని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement