#YSRCPAgain2024 trends on top of Twitter - Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌ను ఊపేస్తున్న వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా సైన్యం..

Published Tue, May 23 2023 10:01 AM | Last Updated on Tue, May 23 2023 11:40 AM

Twitter Hashtag Trending With YSRCP Again 2024 - Sakshi

సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించి నాలుగేళ్లయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ‘వైఎస్సార్‌సీపీ ఎగైన్‌ 2024’ హ్యాష్‌టాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు. దీంతో, పది నిమిషాల్లోనే ఈ ట్రెండింగ్‌ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. 

తన నాలుగేళ్ల పాలనలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సమాచారంతో కూడిన ట్వీట్లను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ట్వీట్‌ చేశారు. వీటికి దేశవ్యాప్తంగా భారీగా వ్యూస్‌ వచ్చాయి. ఇటీవలి కాలంలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో యమా దూకుడుగా వ్యవహరిస్తోంది. గతేడాది సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా జరిగిన ట్రెండింగ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

ఇది కూడా చదవండి: చారిత్రక విజయానికి నాలుగేళ్లు..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement