ఒక్క ఓటుతో విజయం ! | Congress Leader Wins One Vote Differents | Sakshi
Sakshi News home page

ఒక్క ఓటుతో విజయం !

Published Tue, Sep 4 2018 11:20 AM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM

Congress Leader Wins One Vote Differents - Sakshi

విజేత పునీత్‌

బొమ్మనహళ్లి : ఇద్దరికి సరిసమానంగా ఓట్లు వచ్చాయి... అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఒకరిని విజేతగా నిలిపింది. వివరాలు... ఉడిపి జిల్లా సాలిగ్రామ పట్టణ పంచాయతీ 4వ వార్డుకు బీజేపీ తరఫున కరుణాకర్, కాంగ్రెస్‌ తరఫున పునీత్‌ పూజరి బరిలో ఉన్నారు. సోమవారం జరిగిన కౌంటింగ్‌లో ఇద్దరికి సరిసమానంగా 245 ఓట్లు వచ్చాయి. అధికారులు మూడు పర్యాయాలు ఓట్లను లెక్కించినా తేడా రాలేదు. ఇంతలో ఈ వార్డుకు ఒక పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఉన్నట్లు గుర్తించిన అధికారి, పోస్టల్‌ బ్యాలెట్‌ను తీయగా అది కూడా పునీత్‌కే ఓటు వేశారు. దీంతో పునీత్‌ను విజేతగా ప్రకటించారు. ఒక్క ఓటుతో పరాజయమైన బీజేపీ అభ్యర్థి కరుణాకర్‌లో నిరాశ నెలకొంది. ఒక్క ఓటుతో విజయం సాధించిన పునీత్‌ను పలువురు అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement