ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో వరుసగా మూడు ‘డ్రా’ల అనంతరం ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఘనవిజయం సాధించింది.
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో వరుసగా మూడు ‘డ్రా’ల అనంతరం ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఘనవిజయం సాధించింది. గురువారం ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో నెగ్గింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఢిల్లీ తరఫున నబీ (35వ నిమిషంలో), ఎడతోడికా (40), రీసే (87) గోల్స్ సాధించారు. పుణే నుంచి ఇంజ్యురీ సమయం (90)లో ముటు ఏకైక గోల్ సాధించాడు. నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడుతుంది.