Delhi Dynamos
-
నార్త్ఈస్ట్ యునైటెడ్ బోణీ
వాస్కోడగామా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) బోణీ కొట్టింది. ఇక్కడి తిలక్ మైదాన్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ 1–0తో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. జట్టుకు లభించిన పెనాల్టీని 49వ నిమిషంలో గోల్‌గా మలిచిన అపియా నార్త్ఈస్ట్కు విజయం దక్కేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై... ఆ అంచనాలకు తగ్గట్టే మ్యాచ్‌ను ఆరంభించింది. ముఖ్యంగా అహ్మద్ జాహూ, హ్యూగో బౌమస్, ఒగ్బెచే చక్కటి సమన్వయంతో కదులుతూ నార్త్ఈస్ట్పై ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ దగ్గరికి బంతిని తీసుకెళ్లినా... ఫినిష్ చేయడంలో సఫలం కాలేకపోయారు. నేటి మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీతో బెంగళూరు ఎఫ్‌సీ తలపడుతుంది. -
ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్
షూటౌట్లో ఢిల్లీ డైనమోస్‌పై విజయం 18న కోల్‌కతాతో టైటిల్ పోరు న్యూఢిల్లీ: టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఈసారి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బరిలోకి దిగిన కేరళ బ్లాస్టర్స్ లక్ష్యానికి చేరువైంది. ఢిల్లీ డైనమోస్‌తో జరిగిన సెమీఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ 3–0తో పెనాల్టీ షూటౌట్లో విజయాన్ని దక్కించుకుంది. ఈనెల 18న జరిగే ఫైనల్లో అట్లెటికో డి కోల్‌కతాతో కేరళ బ్లాస్టర్స్ తలపడుతుంది.కొచ్చిలో జరిగిన తొలి అంచె సెమీఫైనల్లో 1–0తో నెగ్గిన కేరళ బ్లాస్టర్స్... ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన రెండో అంచె సెమీఫైనల్లో 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ తరఫున పెరీరా (21వ ని.లో), రోచా (45వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... కేరళ జట్టుకు నజోన్ (24వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. రెండు అంచెల సెమీఫైనల్ తర్వాత ఇరు జట్ల స్కోరు 2–2తో సమం కావడంతో ఫలితం తేలడానికి పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జోసు కురైస్, కెర్వెన్ బెల్ఫోర్ట్, మొహమ్మద్ రఫీక్ సఫలమవ్వగా... ఢిల్లీ తరఫున ఫ్లోరెంట్ మలూదా, బ్రూనో పెలిసారి, ఎమర్సన్ గోమ్స్ విఫలమయ్యారు. మలూదా కొట్టిన షాట్ గోల్ పోస్ట్ పైనుంచి బయటకు వెళ్లగా... పెలిసారి, గోమ్స్ షాట్లను కేరళ గోల్‌కీపర్ సందీప్ నందీ నిలువరించాడు. -
ఢిల్లీపై కోల్‌కతా విజయం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా రెండో స్థానానికి ఎగబాకింది. శనివారం ఢిల్లీ డైనమోస్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 1-0తో గెలిచింది. ఇయాన్ హ్యుమే 78వ నిమిషంలో స్పాట్ కిక్ ద్వారా జట్టుకు ఏకైక గోల్‌ను అందించాడు. -
ఢిల్లీని గెలిపించిన రాబిన్ సింగ్
ఐఎస్ఎల్ తొలి అంచె సెమీస్‌లో గోవా ఓటమి న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ తొలి అంచె సెమీస్‌లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఆకట్టుకుంది. గోవా ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 1-0తో గెలిచింది. లీగ్ చరిత్రలో గోవా జట్టుపై ఢిల్లీ నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో అంచె సెమీస్ 15న గోవాలో జరుగుతుంది. ఢిల్లీ తరఫున ఏకైక గోల్ రాబిన్ సింగ్ (42వ నిమిషంలో) చేశాడు. లీగ్ దశలో టాపర్‌గా నిలిచిన గోవాపై ఆరంభం నుంచే ఢిల్లీ ఆటగాళ్లు ప్రణాళిక ప్రకారం ఆడారు. గోవా అటాకింగ్ ఆటను అడ్డుకుంటూనే తమ దాడులు తీవ్రం చేశారు. ఫలితంగా 42వ నిమిషంలో అండర్సన్ చికావో పంపిన క్రాస్‌ను రాబిన్ సింగ్ హెడర్ గోల్ చేసి జట్టు శిబిరంలో ఆనందం నింపాడు. -
ఢిల్లీ డైనమోస్ విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో వరుసగా మూడు ‘డ్రా’ల అనంతరం ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఘనవిజయం సాధించింది. గురువారం ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో నెగ్గింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఢిల్లీ తరఫున నబీ (35వ నిమిషంలో), ఎడతోడికా (40), రీసే (87) గోల్స్ సాధించారు. పుణే నుంచి ఇంజ్యురీ సమయం (90)లో ముటు ఏకైక గోల్ సాధించాడు. నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడుతుంది. -
ఐఎస్ఎల్: ఢిల్లీ డైనమోస్ పై గోవా విజయం
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) 2015లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ జట్టు 2-0 తేడాతో ఢిల్లీ డైనమోస్‌పై విజయం సాధించింది. స్థానిక జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో ఆడటంతో ప్రేక్షకుల మద్ధతు కూడగట్టుకున్న గోవా జట్టు చెలరేగిపోయింది. ఆట ప్రారంభమైన మూడో నిమిషంలో ఢిల్లీ ప్లేయర్ సౌవిక్ చక్రవర్తి చేసిన తప్పిదంతో గోవా జట్టు ఖాతా తెరిచినట్లయింది. బంతిని అడ్డుకునే ప్రయత్నంలో తానే గోల్ పోస్ట్ లోకి బంతిని నెట్టడంతో గోవా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రథమార్ధం చివరి నిమిషంలో స్టార్ ప్లేయర్ రీనాల్డో గోల్ చేయడంతో గోవా 2-0తో ఢిల్లీపై ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. చివరివరకూ గోల్ పోస్ట్‌లపై దాడులు చేసినప్పటికీ ఢిల్లీ మాత్రం తన ఖాతా తెరవలేకపోయింది. దీంతో గోవా జట్టు 2-0 తేడాతో ఢిల్లీపై విజయాన్ని సొంతం చేసుకుంది. -
ఢిల్లీ డైనమోస్ కు స్పానిష్ గోల్ కీపర్
అక్టోబర్ 2న ప్రారంభం కానున్న రెండో సీజన్ కోసం ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫ్రాంచైజీ ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సీ స్పానిష్ గోల్ కీపర్ టోనీ బోడ్లాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. టోనీ రియల్ బెటీస్ తరఫున 95 మ్యాచ్ లు ఆడాడని... అతని రాక టీమ్ కు ఎంతో ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ అభిప్రాయపడింది. ఢిల్లీ డైనమోస్ తో ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని టోనీ తెలిపాడు. ఈ సీజన్ లో తన టీమ్ టైటిట్ గెలిచేందుకు కృషి చేస్తానని అన్నాడు.