హరికృష్ణ గెలుపు
దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో విజయాన్ని సాధించాడు. శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హరికృష్ణ 45 ఎత్తుల్లో బార్టోజ్ సోకో (పోలండ్)పై గెలిచాడు. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు రెండో ఓటమి ఎదురైంది. భారత్‌కే చెందిన సూర్యశేఖర గంగూలీతో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో హారిక 35 ఎత్తుల్లో ఓడిపోయింది.