Qatar Masters chess tournament
-
ఖతార్ మాస్టర్స్ టోర్నీ: హారికకు రెండో గెలుపు
దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో విజయాన్ని తన ఖాతాలో జమచేసుకుంది. ఎరిక్ హెడ్మాన్ (స్వీడన్)తో ఆదివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 32 ఎత్తుల్లో గెలిచింది. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఈ టోర్నీలో తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. ఎల్తాజ్ సఫర్లీ (అజర్బైజాన్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 22 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. భారత్‌కే చెందిన విజయలక్ష్మీ, కొంగువేల్ పొన్నుస్వామి, అభిజిత్ గుప్తా, సందీపన్ చందాలు తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. -
హరికృష్ణ గెలుపు
దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో విజయాన్ని సాధించాడు. శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హరికృష్ణ 45 ఎత్తుల్లో బార్టోజ్ సోకో (పోలండ్)పై గెలిచాడు. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు రెండో ఓటమి ఎదురైంది. భారత్‌కే చెందిన సూర్యశేఖర గంగూలీతో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో హారిక 35 ఎత్తుల్లో ఓడిపోయింది. -
హారికకు తొలి విజయం
దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయాన్ని సాధించింది. గూ జియోబింగ్ (చైనా)తో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో తెల్లపావులతో ఆడిన హారిక 40 ఎత్తుల్లో గెలిచింది. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 81 ఎత్తుల్లో మిఖైలో ఒలెక్సియెంకో (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయాడు.